Tiruapati, May 30: ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి పుట్టిన రోజు సందర్భంగా గుడికి తీసుకెళ్లమంటూ ప్రియుడికి చెప్పి దారి మధ్యలో ప్రియుడిని చెట్టుకు కట్టేసి దారుణం ప్రియురాలిపై రేప్ చేశాడు స్నేహితుడు. సూళ్లూరు పేట మండల పరిధిలోని దామరాయ గ్రామ పరిసరాల్లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు, యువతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ, సహజీవనం చేస్తున్నారు. ఆ యువకుడికి ఏడుమలై, బాలాజీ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మంగళవారం ఉదయం ఆ యువకుడు, ఏడుమలై సూళ్లూరుపేటలో మద్యం తాగారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేశారు. ముంబైలో దారుణం, సహోద్యోగి కుమార్తెపై వంతుల వారిగా అత్యాచారం, అరుస్తుందనే భయంతో గొంతు పట్టుకుని హింసిస్తూ..
ఏడుమలై ఆ రోజు రాత్రి ఆ యువకుడికి ఫోన్ చేసి నీ ప్రేయసి బర్త్‌డే కదా.. ఆమెను తీసుకుని కొరిడి శివాలయం వెళ్లు అని చెప్పాడు. అది నమ్మిన ఆ యువకుడు కంపెనీలో పనికి వెళ్లిన ప్రియురాలి కోసం సూళ్లూరుపేటలోని వైజంక్షన్ వద్ద వేచి ఉండగా ఏడుమలై, బాలాజీ వచ్చారు. కొంతసేపటికి యువతి రావడంతో వారందరూ కలిసి శివాలయానికి బయల్దేరారు.
ఈ క్రమంలో పులికాట్ తీరంలోని దామరాయ పరిసరాల్లోకి వెళ్లగా ఏడుమలై, బాలాజీ కలిసి ఆ యువకుడి చొక్కా విప్పి, దాంతోనే అతడిని కట్టేశారు. ఆ తర్వాత ఏడుమలై ఆ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలాజీ ప్రియుడికి కాపలాగా ఉన్నాడు. అనంతరం వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్, నగదు లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాగోలా అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాధితులు తమ కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పారు. దాంతో వారు శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేశారు.