Andhra Pradesh: గుంటూరులో దారుణం, బాలికపై 80 మంది కామాంధులు అత్యాచారం, 74మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ఆరుగురి కోసం గాలింపు

దళిత బాలికను వివిధ ప్రాంతాలు తిప్పుతూ, వ్యభిచారం చేయించిన ఘటన గుంటూరులో కలకలం రేపిన సంగతి విదితమే ఈ కేసును చేధించిన పోలీసులకు (Andhra Pradesh Police) దిమ్మతిరిగే విషయాలు తెలిసాయి. బంగారం, బాండ్లు, ప్రా మిసరీ నోట్లు సైతం చేతులు మారి.. రెండు రాష్ట్రాల్లో 80 మంది వరకు (Nearly 80 People) బాలికపై తెగబడ్డారు.

Andhra Pradesh: గుంటూరులో దారుణం, బాలికపై 80 మంది కామాంధులు అత్యాచారం, 74మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ఆరుగురి కోసం గాలింపు
Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

Guntur, April 21: దళిత బాలికను వివిధ ప్రాంతాలు తిప్పుతూ, వ్యభిచారం చేయించిన ఘటన గుంటూరులో కలకలం రేపిన సంగతి విదితమే ఈ కేసును చేధించిన పోలీసులకు (Andhra Pradesh Police) దిమ్మతిరిగే విషయాలు తెలిసాయి. బంగారం, బాండ్లు, ప్రా మిసరీ నోట్లు సైతం చేతులు మారి.. రెండు రాష్ట్రాల్లో 80 మంది వరకు (Nearly 80 People) బాలికపై తెగబడ్డారు. ఇప్పటివరకు 74మందిని ఈ కేసులో గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు.

కాగా ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల పిల్లలు నిందితులుగా ఉన్నారు. మొత్తం దందాను ఓ మహిళా హోంగార్డు, ఆమె కుమార్తె బెజవాడ కేంద్రంగా నడిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈకేసులో లండన్‌లో ఉంటున్న మరో నిందితుడికి రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి వ్యభిచార నిర్వాహకుల ముఠా వ్యభిచార రొంపిలోకి దించింది. బాలికను నిర్వాహకులు ఒకరి తర్వాత ఒకరు కొనుగోలు చేస్తూ వివిధ ప్రాంతాలకు తిప్పి వ్యభిచారం ( Rape of Minor Girl in Guntur) చేయించారు. విజయవాడ, తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్‌లలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిలో విజయవాడలోని ఇబ్రహీంపట్నం కు చెందిన మహిళా హోంగార్డు జెసింత, ఆమె కుమార్తె హేమలత ముఖ్య పాత్ర పోషించారు.

కోడలిపై కన్నేసిన మామ, రూంలోకి లాక్కెళ్లి రాత్రంతా అత్యాచారం, నీమొగుడు లేని లోటు తీరుస్తానని, వినకుంటే కొడుకుని చంపేస్తానని బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

గుంటూరు పోలీసుల కథనం ప్రకారం.. జెసింత మహిళా నాయకురాలిగా, పోలీస్ స్టేషన్లలో పంచాయితీలు చేస్తూ తనకు పరిచయమైన వారిలో నిస్సహాయులను ట్రాప్‌ చేస్తుంది. ఈ వ్యవహారంలో హేమలత తల్లికి సహకరిస్తోంది. ట్రాప్‌ చేసినవారిని తల్లీకుమార్తె గుంటుపల్లిలో(విజయవాడ) అద్దెకు తీసుకున్న ఇంటిలో ఉంచి వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సవర్ణకుమారి అనే వ్యభిచార గృహ నిర్వాహకులి ద్వా రా బాధితురాలు జెసింత చేతుల్లో పడింది. కొవిడ్‌బారినపడిన దళిత బాలిక తల్లిని ఆమె తండ్రి గత ఏడాది జూన్‌లో గుంటూరు ప్రభుత్వాస్పత్రి లో చేర్చారు. అక్కడ బాధితురాలిని చూసి సవర్ణకుమారి స్నేహం పెంచుకుంది.

చికిత్స పొందుతూ ఆ ఆస్పత్రిలో బాధితురాలి తల్లి చనిపోయింది. ఆస్పత్రిలో ఉన్న తండ్రికి చెప్పకుండా బాధితురాలిని సవర్ణకుమారి తీసుకెళ్లిపోయింది. రెండునెలలపాటు అనేక ప్రాంతాలకు బాధితురాలిని తి ప్పుతూ వ్యభిచారం చేయించింది. ఈ క్రమంలోనే జెసింత వద్దకు బాలిక చేరింది. ఇక్కడ ఉండగానే ఆ కూపం నుంచి ఎలాగోలా బయటపడి గత ఏడాది ఆగస్టులో పోలీసులను కలిసి బాధితురాలు ఫిర్యాదు చేసింది.

ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటున్న మూడేళ్ల మేనకోడలు, తలుపులేసి దారుణంగా అత్యాచారం చేసిన మేనమామ, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

ఈ కేసులో ఈ ఏడాది జనవరిలో తొలి అరెస్టు జరిగింది. మంగళవారం ఒక్కరోజే బీటెక్‌ విద్యార్థి సహా పదిమందిని అరెస్టు చేశారు. ఈ వివరాలను గుంటూరు అదనపు ఎస్పీ సుప్రజ మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి కారు, మూడు ఆటోలు, మూడు ద్విచక్ర వాహనాలు, 49 సెల్‌ఫోన్లు, బంగారం, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మహిళా హోంగార్డు జెసింత కూతురు కూడా ఇ దే వృత్తిలో ఉందని.. వారు ఈ కేసులో 110 రోజులు రిమాండ్‌లో ఉన్నారన్నారు. జైలు నుంచి వ చ్చిన తర్వాత తాజా, మాజీ విటులను కలిసి తల్లీకుమార్తె బెదిరింపులకు పాల్పడ్డారని, ''మీ పేర్లు పోలీసులకు చెప్పకుండా ఉండాలంటే రూ.50 వేలు తేవాలి'' అని బెదరగొట్టారన్నారు.

(The above story first appeared on LatestLY on Apr 21, 2022 03:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).