Balakrishna Slams CM Jagan: జగన్‌కు పబ్‌జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు, యువగళం పాదయాత్రలో మండిపడిన బాలయ్య, మళ్లీ సైకో పాలన వస్తే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని వెల్లడి
అనంతపురం జిల్లా శింగనమలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు.మార్తాడులోని క్యాంప్ సైట్ నుంచి లోకేశ్‌తో కలిసి ఆయన ముందుకు సాగారు. అంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Singanamala, April 7: అనంతపురం జిల్లా శింగనమలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు.మార్తాడులోని క్యాంప్ సైట్ నుంచి లోకేశ్‌తో కలిసి ఆయన ముందుకు సాగారు. అంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. లోకేశ్ పాదయాత్ర యువతరానికి స్ఫూర్తి అన్నారు. గతంలో యువత కోసం టీడీపీ ఏం చేసిందో ఆయన చెబుతున్నారని.. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్‌కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.
జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదు. చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉంది. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వలసపోవాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. చాలా మంది మా పార్టీతో టచ్‌లో ఉన్నారు.
టీడీపీలో చేరి ప్రజాసేవ చేద్దామని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రికి పబ్‌జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. వైసీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు. వైసీపీ అరాచకాలను ఎదిరించేందుకు ప్రజలంతా ముందుకు రావాలి. టీడీపీ పాలన మళ్లీ వస్తుంది.. అందరి సమస్యలు పరిష్కరిస్తుంది’’ అని హీరో బాలయ్య అన్నారు.
(The above story first appeared on LatestLY on Apr 07, 2023 12:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

