Jagananna Maa Bhavishyathu (Photo-Twitter)

VJY, April 7: రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకునే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి నేటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టింది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ సైనికులుగా పార్టీ పదాతిదళం ప్రతి ఇంటికీ వెళ్తుంది. దాదాపు 7 లక్షల మంది గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు 1.60 కోట్ల ఇళ్లను 14 రోజుల్లో సందర్శిస్తారు. ఐదుకోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటారు. ‘మమ్మల్ని జగనన్న పంపారు. మీతో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు వచ్చాం’ అని చెబుతారు.

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఒకేసారి 56 మందికి స్థాన చలనం.. జాబితాలో 8 జిల్లాల కలెక్టర్లు కూడా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రధాన కార్యదర్శి

రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనుంది.సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది.

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్, తోడేళ్లంతా ఏకమై వచ్చినా నేను సింగిల్‌గానే వస్తానని వెల్లడి, ప్రజలే నా సైనికులని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్‌ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు.

ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలివీ..

1 . ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందా?

2 . మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా?

3 .గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులను నేరుగా మీ అకౌంట్‌లో వేయడం లేదా వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా?

4 . నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా?

5. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా?

కిట్‌ బ్యాగ్‌లో ఏముంటాయంటే..

♦ ఒక్కో కిట్‌ బ్యాగ్‌లో 200 ఇళ్లకు సరిపడా సామగ్రి ఉంటుంది.

♦టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ రూపొందించిన 200 కరపత్రాలు

♦ ప్రజా మద్దతు పుస్తకాలు టమూడు పెన్నులు

♦ ఇద్దరు గృహ సారథులు, ముగ్గురు కన్వినర్లు ధరించేందుకు సీఎం జగన్‌ ఫొటోతో కూడిన ఐదు బ్యాడ్జీలు

♦సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో ఉన్న 200 స్టిక్కర్లు

♦ సీఎం జగన్‌ ఫోటో ఉన్న 200 మొబైల్‌ ఫోన్‌ స్టిక్కర్లు

ఐదు ప్రశ్నలతో ఇంటింటికీ గృహ సారథులు

♦ గత 46 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరిస్తారు.

♦ గత సర్కార్‌కు, ఈ ప్రభుత్వ పాలనకు వ్యత్యాసాన్ని తెలియచేసేలా కరపత్రాలు అందిస్తారు.

♦ ఐదు ప్రశ్నలకు అభిప్రాయాలను సేకరించి ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేసి రసీదు అందచేస్తారు.

♦ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960–82960 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని కోరుతారు. ఆ తర్వాత నిమిషం లోపే సంబంధిత కుటుంబానికి ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ కృతజజ్ఞతలు తెలియచేస్తారు.

♦ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపు (డోర్‌), మొబైల్‌ ఫోన్‌కు వారి అనుమతితో సీఎం జగన్‌ ఫోటోను అతికిస్తారు.