Coronavirus in AP: ఏపీలో కోటి దాటిన ఫస్ట్‌,సెకండ్‌​ డోసు టీకాలు తీసుకున్న వారి సంఖ్య, 24 గంటల్లో 11,303 మందికి కరోనా పాజటివ్, ఇప్పటి వరకు 1,93,50,008 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 93,704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,303 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా కారణంగా 104 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 18,257 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 15 లక్షల 46 వేల 617 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

Coronavirus in AP: ఏపీలో కోటి దాటిన ఫస్ట్‌,సెకండ్‌​ డోసు టీకాలు తీసుకున్న వారి సంఖ్య, 24 గంటల్లో 11,303 మందికి కరోనా పాజటివ్, ఇప్పటి వరకు 1,93,50,008 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు
COVID-19 Vaccination (Photo Credits: PTI)

Amaravati, June 1: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 93,704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,303 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా కారణంగా 104 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 18,257 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 15 లక్షల 46 వేల 617 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 1,46,737 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,93,50,008 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ మంగళ వారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.

కోవిడ్‌​ సంక్షోభ సమయం, వ్యాక్సిన్ల కొరత తదితర సమస్యలకు సతమతమయిన ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో కోటి మందికి ఫస్ట్‌, సెకండ్‌​ డోసు టీకాలు అందించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 20 శాతం మందికి టీకాలు అందించింది. ఏపీలో ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ టీకాలు తీసుకున్న వారి సంఖ్య కోటి దాటింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో మొదటి, రెండో తీసుకున్నవారు 1,00,17,712 మందిగా ఉన్నారు. కేవలం మొదటి డోసు తీసుకున్నవారి సంఖ్య 74,92,944గా నమోదయ్యింది. ఇక స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 25,24,768గా ఉంది.

ఆనందయ్య కరోనా మందులు ఎలా వాడాలి, వాటిని ఎలా తయారుచేస్తారు, కరోనా పేషెంట్లు అయితే ఏ మందులు వాడాలి, నెగిటివ్ ఉన్న వారు ఏమి వాడాలి, కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై వివరణాత్మక కథనం

కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం సృష్టించడంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం జగన్‌ సమీక్షలు నిర్వహిస్తూ కొవిడ్‌ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించారు. కొవిడ్‌ వైద్య సేవల్లో ఎక్కడ అంతరాయం రాకుండా చూశారు. మరోవైపు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి సకాలంలో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు వచ్చేలా వ్యూహం రచించారు. రాష్ట్రానికి కేటాయించిన వ్యాక్సిన్లను ఆలస్యం చేయకుండా యుద్ధప్రతిపాదికన ప్రజలకు అందించారు. దీంతో అతి తక్కువ కాలంలోనే కోటి మందికి కరోనా నుంచి రక్షణ కల్పించగలిగారు.

(The above story first appeared on LatestLY on Jun 01, 2021 06:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).