SPSR Nellore, June 1: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందులతో (Anandayya Ayurveda Medicine) దుష్ప్రభావాలు లేవని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్‌ఏఎస్), ఇతర సంస్థలు ఇచ్చిన నివేదికల మేరకు ఈ మందు (Krishnapatnam Medicine) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే.
ఆనందయ్య ఇస్తున్న 5 రకాల మందుల్లో 3 రకాలకు అనుమతి ఇచ్చింది. నోటి ద్వారా ఇచ్చే ‘పీ’, ‘ఎల్’, ‘ఎఫ్’ అనే మూడు మందులకు ప్రభుత్వం (Andhra Pradesh government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి నివేదికలు రావాల్సి ఉంది. మరో మందు తయారీ అధికారుల ముందు చూపించనందున అనుమతి ఇవ్వలేదు.
ఏపీ హైకోర్టు (AP High Court) కూడా ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చింది. ఆనందయ్య మందును (Anandayya Corona medicine) పంపిణీ చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కంట్లో వేసే చుక్కల మందుపై గురువారం లోగా పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణకు 5 రకాల మందులు (Nellore Corona medicine) తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. మరి అవి ఎలా తయారు చేస్తున్నారు. వాటిని ఎలా ఉపయోగించాలో అనే దాన్ని పరిశిలిస్తే..
మొదటి రకం పీ మందు
ఈ మందు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్ వచ్చిన వారు రోజుకు రెండుసార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్ లేనివారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఒక్కరోజు రెండుసార్లు వినియోగించాలి. ఇందులో తెల్లజిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్ దంగిలే 5 బకెట్లు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, తోకమిరియాలు, పచ్చకర్పూరం, ఫిరంగిచెక్క పొడి ఒక బకెట్ మిక్సీవేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి 4 గం టలు ఉడికించి ఈ మందును తయారు చేస్తున్నారు.
రెండవ రకం ఎఫ్:
ఈ మందును పాజిటివ్ ఉన్న వారికి ఇస్తున్నారు. భోజనం తర్వాత రెండుసార్లు చొప్పున మూడురోజులు తీసుకోవాలి. పుప్పింటి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోల వరకు సిద్ధం చేసి అన్నింటిని కలిపి మిక్సీవేసిన తరువాత చూర్ణంగా ఈ మందు తయారు చేస్తున్నారు.
మూడవ రకం ఎల్:
ఇది కూడా పాజిటివ్ ఉన్న పేషెంట్లకే ఇస్తున్నారు. పి, ఎఫ్ రకాల మందుతోపాటు రోజుకు ఒక్కసారి చొప్పున ఈ మందును రెండు రోజులు తీసుకోవాలి. నేల ఉసిరి, గుంటగలగర ఆకులు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కిలోలు తీసుకుని దీన్ని తయారు చేస్తున్నారు.
నాలుగవ రకం కె:
ఇది కూడా కరోనా పాజిటివ్ ఉన్న వారికే ఇస్తున్నారు. రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోలు తీసుకుని కలిపి తయారు చేస్తున్నారు.
అయిదవ రకం ఐ:
ఇది ఆక్సిజన్ తగ్గిన వారికి కంటి డ్రాప్స్. పల్స్‌ను బట్టి ఒక్కో కంట్లో ఒక్క డ్రాప్ వేయాలి. దీన్లో తేనె, ముళ్లవంకాయ గుజ్జు, తోకమిరియాలు,కిలో తేనెతో ఈ డ్రాప్స్‌ను తయారు చేస్తున్నారు. అయిదే దీనికి ఇంకా అధికారికంగా అనుమతి రాలేదు. వచ్చిన తరువాత ఈ మందును కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై పరిశోధన చేస్తున్నారు.