Machilipatnam Doctor Murder: మచిలీపట్నంలో మహిళా డాక్టర్ దారుణ హత్య, గొంతు కోసి అతి కిరాతకంగా చంపిన దుండగులు, బంగారు నగలు అపహరణ
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిల్లల వైద్య నిపుణురాలైన డాక్టర్ రాధ దారుణ హత్యకు గురయ్యారు. గత రాత్రి వారి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. రాధ గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు.
Vjy, July 26: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిల్లల వైద్య నిపుణురాలైన డాక్టర్ రాధ దారుణ హత్యకు గురయ్యారు. గత రాత్రి వారి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. రాధ గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు. నగరంలోని జవ్వారుపేట జంక్షన్‌లో నివాసముంటున్న డాక్టర్ ఉమామహేశ్వరరావు, రాధ దంపతులు చిన్నపిల్లల వైద్యులు. సొంతంగా ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.
నగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఆస్పత్రిలోని కింద అంతస్తులో ఓపీ(అవుట్ పేషెంట్)లను చూస్తున్న ఆయన.. తన భార్య ఎంతకు కిందకు రాకపోవడంతో ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆమె స్పందించలేదు. దీంతో ఉమామహేశ్వరరావు మొదటి అంతస్తుకు వెళ్లి చూడగా.. తల, గొంతు భాగంలో తీవ్ర గాయాలతో రాధ రక్తపు మడుగులో పడి ఉంది.
కొడుకును కనలేదని కోడలిని వంట రూంలో పడేసి దారుణంగా కొట్టిన అత్త, వీడియో ఇదిగో..
దీంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో కారంపొడి చల్లి ఉండటంతో పాటు, రాధ ఒంటిపై ఉన్న బంగారు నగలు అపహరణకు గురయ్యాయని చెప్పారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్‌టీం సాయంతో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
(The above story first appeared on LatestLY on Jul 26, 2023 06:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

