Andhra Pradesh: యువతి అడగ్గానే న్యూడ్ వీడియోలు పంపిన యువకుడు, ఆ తర్వాత చుక్కలు చూపించిన యువతి, డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్
ఆమె తియ్యని మాటలకు ఆ యువకుడు పడిపోయాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొన్నిరోజుల తర్వాత, నగ్న వీడియోలు (his nude videos) తీసి పంపాలని ఆ యువకుడిని సదరు మహిళ కోరింది. ఆమె అడిగిందే తడవుగా పలు నగ్న వీడియోలు తీసి ఆమెకు పంపించాడు.
Tadepalle, Sep 19: సైబర్ నేరగాళ్లు ఓ వైపు రెచ్చిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు దాని వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఏపీలోని తాడేపల్లికి చెందిన ఓ యువకుడు సైబర్ వలలో చిక్కుకున్నాడు. ఓ మహిళ అతడి నగ్న వీడియోలతో బెదిరింపులకు (Woman threatens student) పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల యువకుడు యూనివర్సిటీలో బీబీఏ కోర్సు చదువుతున్నాడు.
అతడికి ఒకరోజు గుర్తు తెలియని మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె తియ్యని మాటలకు ఆ యువకుడు పడిపోయాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొన్నిరోజుల తర్వాత, నగ్న వీడియోలు (his nude videos) తీసి పంపాలని ఆ యువకుడిని సదరు మహిళ కోరింది. ఆమె అడిగిందే తడవుగా పలు నగ్న వీడియోలు తీసి ఆమెకు పంపించాడు. అయితే అతడు ఏమాత్రం ఊహించని విధంగా ఆమె బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది. తనకు డబ్బు ఇవ్వకపోతే నగ్న వీడియోలు బయటపెడతానంటూ ఆ యువకుడ్ని బెదిరించసాగింది.
హడలిపోయిన ఆ యువకుడు ఒకసారి రూ.8 వేలు పంపాడు. అయినప్పటికీ ఆమె నుంచి బెదిరింపులు ఆగకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(The above story first appeared on LatestLY on Sep 19, 2022 06:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

