Chittoor Shocker: చిత్తూరులో దారుణం, కానిస్టేబుల్ కూతురు గొంతు కోసిన యువకుడు, తర్వాత ఆత్మహత్యాయత్నం, యువతి అక్కడికక్కడే మృతి

చిత్తూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొండమిట్టలో ప్రశాంతి అనే యువతిని ఓ యువకుడు గొంతు కోసి చంపేశాడు . ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Chittoor Shocker: చిత్తూరులో దారుణం, కానిస్టేబుల్ కూతురు గొంతు కోసిన యువకుడు, తర్వాత ఆత్మహత్యాయత్నం, యువతి అక్కడికక్కడే మృతి
Murder (Photo Credits: Pixabay)

Chittoor, April 18: చిత్తూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొండమిట్టలో ప్రశాంతి అనే యువతిని ఓ యువకుడు గొంతు కోసి చంపేశాడు . ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉంది. నిందితుడి పేరు చక్రవర్తిగా గుర్తించారు. ప్రశాంతి ఆరు నెలలుగా కొండమిట్ట ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది.

దోసె వేయలేదని భార్యను కత్తితో నరికి చంపిన భర్త, అడ్డు వచ్చిన కోడలు, మనవరాలిపై దాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

ఈ బ్యూటీ పార్లర్ కు వచ్చిన చక్రవర్తి ఆమెను కత్తితో పొడిచాడు. ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతి చెందిన యువతి ప్రశాంతి ఓ కానిస్టేబుల్ కూతురుగా తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

(The above story first appeared on LatestLY on Apr 18, 2023 08:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).