Andhra Pradesh: సూపర్ సిక్స్ అమలుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాకే పథకాలు అమలు చేస్తామని వెల్లడి, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై (Niti Aayog Report) చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేవంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదని అన్నారు.
Vjy, Jan 27: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై (Niti Aayog Report) చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేవంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదని అన్నారు. తెచ్చిన అప్పులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆదాయం పెరగదని చెప్పారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కూడా ప్రస్తుతం కష్టంగా ఉందని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని తెలిపారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని సూచించారు.
అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Press Meet) అన్నారు. అలాగని అప్పులు చేసి.. పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయని తెలిపారు.అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదని పేర్కొన్నారు. అందుకే గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టిందని తెలిపారు.స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్-2025 నివేదికపైనా సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
ఆరోగ్యంపై మనం ఎప్పుడూ దృష్టి పెడతాం. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలం. అనారోగ్యంతో ఉంటే ఇంట్లో అందరికీ ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే అభివృద్ధి పనులు సరిగా చేయలేం. ఇదే కొనసాగితే చివరికి బాధపడేది ప్రజలే. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలి. అభివృద్ధి పనులపై నిధులు ఎక్కువ ఖర్చు చేయాలి. అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుంది. అలాగని అప్పులు చేసి.. పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయన్నారు.
సూపర్ సిక్స్ అమలుపై సీఎం చంద్రబాబు
పథకాలు అమలు చేయడానికి డబ్బుల్లేవ్
విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పథకాల కోసం మళ్లించలేను
డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించను
అప్పు చేసైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఇస్తాము - సీఎం చంద్రబాబు pic.twitter.com/zwLDwoqNNs
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2025
‘‘2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.67 వేల కోట్లు అప్పులు తెచ్చారు. కానీ, ఆ రుణాలను కనీస స్థాయిలో కూడా అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించలేదు. వచ్చిన డబ్బులతో వైసీపీ ప్రభుత్వం దుబారా ఖర్చులు చేసింది. రాష్ట్ర ఆదాయం కూడా 17.1 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గిపోయింది. అప్పులు 16.5 శాతం మేర పెరిగాయి. వడ్డీ కట్టే మొత్తం కూడా 15శాతం పెరిగింది. ఇవి కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా పెద్ద మొత్తంలో జరిగాయి. వైసీపీ హయాంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తేవడం, మూల ధన వ్యయం లేకపోవడం, పన్నులు పెంచడం లాంటి వివిధ అంశాల వల్ల ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.
ఇక సూపర్ సిక్స్ అమలుపై సీఎం చంద్రబాబు చేతులెత్తేసినట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఆర్ధిక పరిస్థితి మెరుగపడ్డాకే పథకాల అమలు (Implementation of Welfare Schemes) చేస్తానంటూ చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు రూ.6,33,568 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా 4.10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మేం ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది.
మేము చెప్పిందే ఇప్పుడు నీతి ఆయోగ్ ధృవీకరించింది. వృద్ధిరేటు సాధిస్తే ఆదాయం పెరిగి, అప్పులు తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకొచ్చారు. అందుకే డెబ్ట్ రీ షెడ్యూల్‌కి వెళ్తున్నాం. ఆర్థిక రంగంలో సుస్థిరత వస్తేనే రాష్ట్రం గాడిన పడుతుంది. ఇప్పుడు తలసరి అప్పు పెరిగింది. గాడిన పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతోంది. ప్ర. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతోపాటు మెరుగైన పాలన అందిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.
సూపర్ సిక్స్‌లో ఎన్టీఆర్ భరోసాలో భాగంగా 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. దీపం 2.0 పథకంలో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, ఇసుక, మద్యం, క్లీన్ ఎనర్జీ, ఎమ్ఎస్ఎమ్‌ఈ లాంటి కొత్త విధానాలు తీసుకువచ్చాం. రూ.8,258 కోట్ల మేర బిల్లులు క్లియర్ చేశాం. రూ.9015 కోట్ల మేర కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి 76 పథకాలు రివైవ్ చేశామన్నారు.
(The above story first appeared on LatestLY on Jan 27, 2025 07:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

