CM YS Jagan Review: శత్రువులు ఎక్కువ, అందుకే వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది, సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుందని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, పలు అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఏపీలో జరుగుతున్న పరిణామాలు, కీలక పథకాలపై ఈ రోజు సమీక్ష సమావేశం (CM YS Jagan Review) నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ సహా వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇళ్ల పట్టాల సమీక్ష సంధర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ (house pattas distribution) ప్రక్రియ త్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు
Amaravati, August 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఏపీలో జరుగుతున్న పరిణామాలు, కీలక పథకాలపై ఈ రోజు సమీక్ష సమావేశం (CM YS Jagan Review) నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ సహా వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇళ్ల పట్టాల సమీక్ష సంధర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ (house pattas distribution) ప్రక్రియ త్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రూ.22వేల కోట్ల విలువైన ఆస్తులను.. 30లక్షల మంది అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఆ సమస్యలను అధిగమించేందుకు వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోంది. కొంత సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుంది’’ అని ఏపీ సీఎం పేర్కొన్నారు.
Here' s YSRCP Tweet
సమయం పట్టినా.. చివరకు న్యాయమే గెలుస్తుంది
-త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతాం
-రూ.22 వేల కోట్ల విలువైన ఆస్తులను 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం
-స్పందన’పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్https://t.co/yfB8rNd1q4#YSJaganCares
— YSR Congress Party (@YSRCParty) August 25, 2020
విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రతి జిల్లాలో ప్రతి వారం రూ.10 కోట్ల మెటీరియల్ కాంపౌనెంట్ పనులు జరగాలి. పనులు వేగంగా జరగాలి’’అని ఈ సందర్బంగా అధికారులను ఆదేశించారు.
నాడు- నేడు కార్యక్రమంపై సమీక్ష
పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సమీక్ష సమావేశంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ పాఠశాలను వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 55వేల అంగన్‌వాడీల్లో నాడు-నేడు కింద పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంపై కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరవాలనే ఆలోచన ఉన్నందున.. అంతకంటే ముందే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా చికిత్సకు ఎక్కువ రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు, ఆస్పత్రులు కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించాలని కోరిన ఏపీ సీఎం జగన్
వైఎస్సార్ చేయూత, స్వయం సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఆర్థిక సహాయం అందించామని బ్యాంకులకు ఈ డబ్బుపై ఎలాంటి హక్కు లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు వస్తే కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి.. హిందూస్థాన్, యూనిలీవర్, ఐటీసీ, పీ&జి, రిలయన్స్, అమూల్.. అలానా గ్రూపులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి మంత్రుల బృందం రివ్యూ చేస్తుందని తెలిపారు.
రైతు భరోసాపై సమీక్ష
మండలాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఎరువులు పంపిణీ చేయాలని సీఎం జగన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా నూటికి నూరు శాతం ఇ-క్రాపింగ్ పూర్తి చేసి.. వ్యవసాయ యాంత్రీకరణపై కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘‘రైతుల గ్రూపులను ఏర్పాటు చేసి యంత్రాలను డెలివరీ చేయాలి. మండల స్థాయిలో కూడా రైతులతో గ్రూపులను ఏర్పాటు చేయాలి.మరో అల్ప పీడనం, రానున్న మూడు రోజులు ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, మెరుపులతో కూడిన వాన, వెల్లడించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం
వర్షాలు బాగా పడినందున ఎరువుల డిమాండ్ పెరుగుతుంది. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులను పంపిణీ చేయాలి. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో ఒక ఎకరా భూమిని గుర్తించాలి’’అని ఆదేశించారు. ‘‘మల్టీపర్పస్ ఫెసిలిటీస్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా గోడౌన్లు, పంట ఆరబెట్టుకోవడానికి ప్లాట్ ఫాం, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు.. పశువుల శాఖ, కలెక్షన్ సెంటర్ కార్యకలాపాల కోసం వసతులు ఏర్పాటు చేయనున్నాం’’ అని తెలిపారు.
పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష
దళితులమీద దాడులు సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఇతరత్రా ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదన్నారు. గత ప్రభుత్వానికి, ఇప్పటికి ప్రభుత్వానికి తేడా ఉందని.. తప్పు ఎవరు చేసినా తప్పే.. చర్యలు తప్పవన్నారు. ఏదైనా పొరపాటు చేస్తే.. ఎస్సైని కూడా జైల్లో పెట్టిన ఘటన గతంలో జరగలేదన్నారు.
తప్పు చేసింది ఎస్సై అయినా సీఐ అయినా సరే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బంధువులే బాధితులైతే.. ఉపేక్షిస్తామా. ఈ ప్రశ్నలు మనకు మనం వేసుకుని నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఈ సందేశాన్ని పోలీసు అధికారులు కింది స్థాయికి తీసుకెళ్లాలి అని సీఎం జగన్ కోరారు.
కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, ఎస్సైలు, తదితర స్థాయిలో ఉన్నవారికి ఓరియెంటేషన్ నిర్వహించాలన్నారు. మానవత్వంతో వ్యవహరించడంతో పాటు.. ప్రజలకున్న హక్కులేంటి.. మనం ఎంత వరకు వెళ్లాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని పైన అవగాహన కలిగించాలని ఆదేశించారు. గుండుకొట్టించడం లాంటి ఘటనలు తప్పు.. అలాంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడకూడదని స్పష్టం చేశారు. వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి కఠినంగా వ్యవహరిస్తున్నమని ఏపీ సీఎం తెలిపారు.
రాష్ట్ర హోంమంత్రి దళితురాలు, డీజీపీ ఎస్టీ అని ఈ సంధర్భంగా సీఎం గుర్తు చేశారు. సమాజంలో దిగువున ఉన్నవారికి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. అక్రమ మద్యం తయారీ, ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా చట్టానికి అతీతులు కారన్నారు. ఇది మనసులో పెట్టుకుని విధులు నిర్వహించాలన్నారు. అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 25, 2020 04:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

