AP Weather Update: మరో అల్ప పీడనం, రానున్న మూడు రోజులు ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, మెరుపులతో కూడిన వాన, వెల్లడించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం

తెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పేలా లేదు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు (Telugu states Rains) ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అయితే, మరో మూడు రోజుల పాటు వర్షాలు (Heavy Rain Fall Alert) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వాన (Andhra Pradesh weather forecast) పడవచ్చని అటు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు.

AP Weather Update: మరో అల్ప పీడనం, రానున్న మూడు రోజులు ఏపీని ముంచెత్తనున్న భారీ వర్షాలు, మెరుపులతో కూడిన వాన, వెల్లడించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం
heavy-rainfall-warning-to-telangana(Photo-ANI)

Amaravati, August 25: తెలుగు రాష్ట్రాలకు వాన గండం తప్పేలా లేదు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు (Telugu states Rains) ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. అయితే, మరో మూడు రోజుల పాటు వర్షాలు (Heavy Rain Fall Alert) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వాన (Andhra Pradesh weather forecast) పడవచ్చని అటు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రెండు రోజుల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

బ౦గాళాఖాత౦లో ఏర్పడిన మరో అల్పపీడన౦ ఉత్తర బ౦గాళాఖాత౦తో పాటు దాని పరిసర ప్రాంతాలలో కేంధ్రీకృతమైందని, తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అటు, రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందన్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం వల్ల వచ్చే 24 గంటల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు గా వాతావరణ శాఖ తెలిపింది. స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చెక్కును అందజేసిన రాష్ట్ర మంత్రులు, పరారీలోనే రమేష్ ఆస్పత్రి డైరక్టర్

వీటి ప్రభావంతో ఉతర కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు. అటు, దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకుని ఏపీలో 2,68,828 మంది డిశ్చార్జ్, యాక్టివ్‌గా 89,516 కేసులు, తాజాగా 8,601 మందికి కరోనా, రాష్ట్రంలో మొత్తం 32,92,501కి చేరిన కరోనా టెస్టులు

మరోవైపు ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ కోస్తా మీదుగా మధ్య తమిళనాడు వరకు కిలోమీటరున్నర ఎత్తులో ఏర్పడింది.వీటి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

(The above story first appeared on LatestLY on Aug 25, 2020 02:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).