Swarna Palace Incident: స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చెక్కును అందజేసిన రాష్ట్ర మంత్రులు, పరారీలోనే రమేష్ ఆస్పత్రి డైరక్టర్
Vijayawada Swarna Palace Fire (Photo-ANI)

Amaravati, August 25: విజయవాడ రమేష్ ఆస్పత్రి స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో (Swarna Palace Incident) మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికం సాయం అందజేసింది. రాష్ట్ర మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను (Rs 50 lakh ex gratia victims family) మంగళవారం అందజేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని (AP Health Minister Alla Nani) మట్లాడుతూ.. రమేష్ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయాలతో బయటపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వంతో స్పందించి మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు 6 చెక్కులు ఇవ్వడం జరిగింది. సాయంత్రం ముగ్గురికి మచిలీపట్నంలో చెక్కులు అందిస్తాం. మరొకరు గర్భిణీ కావడంతో కలెక్టర్‌ వారి ఇంటికి వెళ్లి చెక్కు అందజేస్తారు. నాణ్యతా, భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అనధికారికంగా కోవిడ్ సెంటర్లు నిర్వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. పరారీలో రమేష్ ఆస్పత్రి డైరెక్టర్, ఆచూకి తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటించిన విజయవాడ నగరపోలీసు కమిషనర్‌, రంగంలోకి దిగిన ఎనిమిది ప్రత్యేక బృందాలు

రమేష్ హాస్పిటల్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని నోటీస్ జారీ చేశాము. ఆ ఆస్పత్రిలో అధిక ఫీజుల వసూలు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురుని అరెస్ట్ చేశాం’అని మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు కరోనా బారిన పడుతున్న జర్నలిస్టుల సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని ఆళ్ల నాని తెలిపారు.  స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్నిప్రమాదం

పరారీలో ఉన్న రమేష్ ఆచూకి ఇంకా చిక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబూ.. నేరుగా అడుగుతున్నా.. ఇంతకీ డాక్టర్‌ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా?, లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్‌, డాక్టర్‌ రమేష్‌.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?’ అంటూ ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు. రమేష్‌ ఆస్పత్రి నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించింది, అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వానికి రిపోర్టును అందజేసిన విచారణ కమిటి, రిపోర్టులోని కీ పాయింట్స్ కథనంలో..

అంబటి రాంబాబు దీనిపై స్పందించారు. నేరం జరిగినప్పుడు దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రమేష్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం కారణంగా పది మంది చనిపోయారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా. అప్పుడు నిమ్మగడ్డ రమేష్, ఇప్పుడు డాక్టర్ రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు. ఎందుకు దాస్తున్నారు.. తనని పోలీసులకు అప్పగించాలి. విచారణకు రమేష్ సహకరించాలి. తనని ఎక్కడ దాచారో చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.