Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Amaravati, August 24: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో గత 24గంటల్లో 54,463 కరోనా టెస్టులు చేయగా.. 8,601 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 86మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) సోమవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా గణాంకాల ప్రకారం.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,58,817కి పెరగగా.. ఇప్పటివరకు 3,368 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 89,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 2,68,828 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,92,501 కరోనా నిర్ధారణ పరీక్షలు (Coronavirus Tests) నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

గడిచిన 24 గంటల్లో 54,463 మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. వాటిలో 8,601 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. తాజా పరీక్షలతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 32,92,501కి చేరాయి. ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా, వాట్సాప్ స్టేటస్‌లో వెల్లడించిన ఆదిమూలపు సురేష్, తనను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచన

తాజాగా నెల్లూరులో 10 మంది, ప్రకాశంలో 10 మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు చనిపోయారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కరోనా కేసులు,మరణాలు

అనంతపురం-35,726 , మరణాలు

చిత్తూరు - 30,325, మరణాలు 336

తూర్పుగోదావరి -50,686, మరణాలు 335

గుంటూరు -30,859, మరణాలు 340

కడప -21,162, మరణాలు 167

కృష్ణా -14,029, మరణాలు 251

కర్నూల్- 39,319, మరణాలు 337

నెల్లూరు -23,326, మరణాలు 227

ప్రకాశం - 17,170, మరణాలు 233

శ్రీకాకుళం-18,934, మరణాలు 210

విశాఖపట్టణం -30,715, మరణాలు 251

విజయనగరం -16,240, మరణాలు 143

పశ్చిమగోదావరి -30,326, మరణాలు 256