CM Jagan Review on IT: ఏపీలో 4530 డిజిటల్ లైబ్రరీలు, ఆగస్టు 15న పనులు ప్రారంభించాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు, కంప్యూటర్ పరికరాల కోసం దాదాపుగా రూ.140 కోట్లకు పైగా ఖర్చు చేయనున్న ఏపీ ప్రభుత్వం
ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష (CM Jagan Review on IT) నిర్వహించారు. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాలకు సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Amaravati, August 3: ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష (CM Jagan Review on IT) నిర్వహించారు. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాలకు సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు (Digital Library) ఉండనున్నట్లు సీఎం తెలిపారు.
డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రెన్స్ టెస్టులతో పాటు గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందన్నారు. ప్రతి గ్రామ పంచాయితీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొదటి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం (AP CM YS Jagan) ఆదేశించారు. డిసెంబర్ కల్లా డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తొలివిడతలో భాగంగా 4530 డిజిటల్ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కంప్యూటర్ పరికరాల కోసం దాదాపుగా రూ.140 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలకూ ఇంటర్నెట్ సదుపాయం అందించాలని, నిరంతరం ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, తొలి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈలోగా స్థలాలు గుర్తించి హ్యాండోవర్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నాటికి డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా.. ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి గౌతమ్‌రెడ్డి, ఐటీ, ఫైబర్ నెట్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
(The above story first appeared on LatestLY on Aug 03, 2021 05:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

