YS Viveka Murder Case: వైయస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు, సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో అరెస్ట్ చేసిన సీబీఐ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
YS Vivekananda Reddy (Photo-ANI)

Amaravati, August 3: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనుమానితుడు పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్ట్‌ (CBI Arrests Sunil Yadav) చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. గోవాలో సోమవారం అరెస్ట్‌ చేసిన అనంతరం అక్కడి స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

గోవా స్థానిక కోర్టు ద్వారా సునీల్‌ యాదవ్‌ను ట్రాన్సిట్‌ రిమాండ్‌లో ద్వారా కడప తీసుకొచ్చారు. వివేకా హత్య కేసులో (YS Vivekananda Reddy Murder Case) అనుమానితుడిగా ఉన్న సునీల్‌ కుమార్‌ను ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అరెస్ట్‌ చేసిన సునీల్‌ యాదవ్‌తో పాటు వివేకా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌తో పాటు మరొకరిని విచారిస్తున్నారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.., హంతకులు దొరికారంటూ సోషల్ మీడియాలో వార్తలు, అవి నిజం కాదని ఖండించిన పోలీసులు,ఫేక్ ప్రచారం చేస్తే జైలుకే అంటూ హెచ్చరికలు

వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్‌‌ను ఇప్పటికే పలుమార్లు సీబీఐ (CBI) అధికారులు విచారించారు. తనను సీబీఐ వేధిస్తోందని, థర్డ్ డిగ్రీతో టార్చర్ పెడుతోందంటూ సునీల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అనంతరం ఆయన పులివెందులలోని తన ఇంటికి తాళాలు వేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో సునీల్ గోవాలో తలదాచుకున్నట్లు తెలుసుకున్న సీబీఐ అధికారులు గోవాకు వెళ్లి అరెస్టు చేశారు. గోవా స్థానిక కోర్టులో హాజరు పర్చిన అధికారులు ట్రాన్సిట్‌ రిమాండ్‌లోకి తీసుకున్నారు.

వివేకా హత్య కేసులో కీలక మలుపు, జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మెన్‌ రంగన్న, వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పర్యవేక్షకాధికారిణి డీఐజీ సుధాసింగ్‌ బదిలీ

హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య దర్యాప్తును స్వీకరించిన సీబీఐ కొన్నాళ్లు విచారణ జరిపి కరోనా కారణంగా ఆపేసి, రెండో దఫా దర్యాప్తు ప్రారంభించింది. కడప కేంద్ర కారాగారం కేంద్రంగా 57 రోజులుగా విచారణ జరుపుతున్నది. అందులో భాగంగా పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సునీల్ కుమార్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. సునీల్ కుమార్ యాదవ్ దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకాకు సన్నిహితంగా ఉండేవారు.

అయితే ఆయన హత్యకేసులో భాగంగా సీబీఐ అధికారులు సునీల్ కుమార్ యాదవ్‌తోపాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. అయితే ఇటీవలే వాచ్‌మెన్ రంగన్న సునీల్ కుమార్ యాదవ్ పేరు ప్రస్తావిస్తూ వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో సునీల్ కుమార్ యాదవ్ ముందస్తు బెయిల్‌కోసం హైకోర్టును ఆశ్రయించారు.