Hyderabad, DEC 13: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అగ్ర నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ (Allu Arjun Arrest) అయిన విషయం తెలిసిందే. చిక్కడపల్లి పోలీసులు అతడిని ఏ11గా అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు ముందు హాజరుపరుచగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండును విధించింది. దాంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు. మరోవైపు అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్ మంజూరు (Bail For Allu Arjun) చేయాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Ram Gopal Varma Reacts On Allu Arjun Arrest
. @alluarjun కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు .
1.
పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?
2.
ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?
3.
ప్రీ రిలీజ్…
— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2024
అయితే అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించగా.. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఎక్స్ వేదికగా స్పందించాడు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన అధికారులకి నేను 4 ప్రశ్నలు వేయాలి అనుకుంటున్నా. 1. పుష్కరాలు, బ్రహ్మోత్సవం లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ? 2.ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ? 3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ? 4. భద్రత ఏర్పాట్లను పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప సినీ నటులు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు అంటూ ప్రశ్నలు వేశాడు. కాగా దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.