Police illegally arrested BRS Leader Errolla Srinivas(video grab)

Hyd, December 26:  మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంట్లో ఉన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుండి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఇక ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌ను ఖండించారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. నాంపల్లి కోర్టులో ఎర్రోళ్లను కలిసి ధైర్యం చెప్పానున్నారు హరీశ్‌.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? చెప్పాలన్నారు. అడిగితే అరెస్టులు..ప్రశ్నిస్తే కేసులు..నిలదీస్తే బెదిరింపులు ఇది సరికాదన్నారు. ఆంధ్రోళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా, ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొడితే సహించేది లేదని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్

ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం...కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికం అన్నారు.

Police Arrested BRS Leader Errolla Srinivas  

ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారు..సెలవు రోజుల్లో కావాలని మా నేతలను అరెస్ట్ చేస్తూ, సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు అని దుయ్యబట్టారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారని..ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదని హెచ్చరించారు.