కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao) అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఆంధ్ర ప్రజల(People of Andhra Pradesh) మనోభావాలను దెబ్బతీసేలా...రాజధాని హైదరాబాద్(Hyderabad)నగరం ప్రశాంతతను భగ్నం చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రోళ్లను, సినిమావాళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా అంటూ మాధవరం ఫైర్ అయ్యారు. ఈ ప్రాంత శాసస సభ్యుడిగా ఈ రకమైన ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ వాళ్లే కాదు.. బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడిన సహించేది లేదన్నారు. శిక్షణ తరగతుల్లో ఆ పార్టీల ఎమ్మెల్యేలు నేర్చుకుంది ఇదేనా? అంటూ మండిపడ్డారు. సినీ పరిశ్రమను ఆనాడు మాజీ సీఎం చెన్నారెడ్డి ఎంతో కష్టపడి తమిళనాడు నుండి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారన్నారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారని గుర్తు చేశారు.

పోలీస్ అధికారి మీడియా ముందు వీధి రౌడీ భాషలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు, చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించిన విష్ణు వర్థన్ రెడ్డి, ట్వీట్ ఇదిగో..

Kukatpally MLA Madhavaram Krishna Rao Slams Govt

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)