ఎవ్వరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తోలు తీస్తామని సస్పెండెడ్ ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి హెచ్చరించారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు. దీనిపై ఎక్స్ వేదికగా బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు. అల్లు అర్జున్ గారికి భారతీయ పౌరసత్వం లేదా ? తెలంగాణ- ఆంధ్ర వారికి ప్రత్యేక పౌరసత్వం, ఆధార్ కార్డు ఉందా ? తీస్ మార్ ఖాన్ ఎవరు ? ఆ ఖాన్ గారికి ప్రత్యేక హోదాలు TelanganaCOPs ఇచ్చిందా? ఒక వీధి రౌడీ భాషలో ఒక పోలీస్ అధికారి మీడియా ముందు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి మాట్లాడం తప్ప కాదా ? TelanganaCMO. ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి గారికి మీరు ఇలా మాట్లాడేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారా TelanganaDGP అంటూ ప్రశ్నించారు.
ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్‌యాదవ్ స్పందించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంధ్య థియేటర్ఘటనపై సస్పెండెడ్ ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టారని తెలిపారు. ఈ విషయంపై డీజీపీకి నివేదిక అందజేస్తున్నామని, ఆయనపై క్రమశిక్షణా చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను సహించబోమని తెలిపారు.
BJP Leader Vishnu Vardhan Reddy Tweet
The TelanganaDGP @TelanganaDGP should clarify who authorised this police officer to conduct a press conference on a private premises? Is he permitted to use such intemperate language? The officer, who spoke so grandly about law... is he not bound by service and conduct rules? Who… https://t.co/zQCPK00tTk
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)