సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆమె స్పందించారు. అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. అల్లు అర్జున్ సైతం ఇది ఊహించి ఉండరని తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ A11గా ఉన్నారని, ఆ ఘటనను రాజకీయం చేసి వాడుకోవడం సరికాదని డీకే అరుణ సూచించారు.

సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన విజయశాంతి, బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుందంటూ మండిపాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పవర్ ఏంటో చూపించుకోవడానికి చేసినట్లు ఉందని డీకే అరుణ విమర్శించారు. రేవంత్ రెడ్డి సోదరుల ఒత్తిడితో రైతు ఆత్మహత్య చేసుకున్నారని.. మరి రేవంత్ రెడ్డి వెళ్లి పరామర్శించారా? అప్పుడు ఆయన పైన కేసు పెట్టాలి కదా అని ఆమె ప్రశ్నించారు. సంధ్య థియేటర్ వివాదంతో తెలంగాణ పరువు పోతోందని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పేరు మర్చిపోయారని కేటీఆర్ ట్రోల్ చేసినందుకే అల్లు అర్జున్ ను ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

DK Aruna Criticizes Political Exploitation of Sandhya Theatre Tragedy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)