సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటన దురదృష్టకరం. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన తెలుగు రాష్ట్రాల నేతల ప్రకటనల్లో ఇది కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి’ అని పేర్కొన్నారు.
Vijayashanti Criticizes Political Exploitation of Sandhya Theatre Tragedy
ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణల విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లు, గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలు అగుపడుతున్నవి.
ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అట్లా…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) December 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)