AP Elections Result 2024: టీడీపీ ఖాతాలో రెండో విజయం, రాజమండ్రి అర్బన్ నుంచి 55వేలకు పైగా మెజార్టీతో గెలిచిన ఆదిరెడ్డి శ్రీనివాస్
ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో రెండో విజయం చేరింది. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు.
ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో రెండో విజయం చేరింది. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వచ్చేసింది, రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్ధి గోరంట్ల ఘన విజయం, మెజార్టీ ఎంతంటే?
ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్‌పై 55వేలకు పైగా ఓట్ల తేడాతో శ్రీనివాస్ నెగ్గారు. అటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం 63,056 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. భారీ విజయం దిశగా కూటమి అడుగులేస్తోంది.
(The above story first appeared on LatestLY on Jun 04, 2024 12:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

