![](https://test1.latestly.com/wp-content/uploads/2024/03/TDP-1-380x214.jpg)
Vijayawada, June 04: ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగిస్తోంది. ఏకంగా 155 స్థానాల్లో ముందంజలో కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇక ఓట్ల లెక్కింపులో తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) గెలుపొందారు.
తన సమీప ప్రత్యర్థి, అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిచెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణపై 63,056 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.