APSRTC: ఏపీ నుంచి ఇతర రాష్టాలకు బస్సులు షురూ, అనుమతించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు (Interstate Transport) తిప్పడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. బస్సులు తిరిగేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

APSRTC: ఏపీ నుంచి ఇతర రాష్టాలకు బస్సులు షురూ, అనుమతించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
APSRTC | Photo: Twitter

Amaravati, June 5: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు (Interstate Transport) తిప్పడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. బస్సులు తిరిగేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

తెలంగాణ (Telangana) నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో పెద్ద సంఖ్యలో వస్తున్న వారికి రాష్ట్ర సరిహద్దులో తనిఖీలు, స్క్రీనింగ్‌ చేసి, వారి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వివరాల సేకరణ సమస్యగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న వారి వివరాలు సేకరించడం కష్టంగా ఉందని, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇది నిజంగా సంచలనమే, 80 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, ఏపీలో తాజాగా 50 కేసులు నమోదు, 3,427కి చేరిన మొత్తం కరోనా కేసులు

లాక్‌డౌన్‌–4 నిబంధనల మినహాయింపు తర్వాత తెలంగాణ నుంచి 13 వేల మంది ఏపీకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం బస్సులు తిప్పడానికి అప్పట్లో ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రయత్నించగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు అంతర్రాష్ట్ర ప్రయాణికులను తెలంగాణ అనుమతిస్తున్నా.. ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని ఇంకా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు.  రాయలసీమ టూ వైజాగ్ వరకు ఇంద్ర బస్సులను నడపాలని ఏపీ సర్కారు నిర్ణయం, ఆదరణ కోల్పోతున్న పల్లెవెలుగు

తమిళనాడు మాత్రం ఇతర రాష్ట్రాల బస్సులను ఇప్పట్లో అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ, ఒడిశా, కర్ణాటక ప్రభుత్వాలకు ఏపీ లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సోమవారం నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

(The above story first appeared on LatestLY on Jun 05, 2020 03:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).