Amaravati, June 2: లాక్‌డౌన్ 5.0 (Lockdown 5) అమలులోకి రావటంతో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఆర్టీసీ జిల్లాల మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించింది . లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో బస్సు సర్వీసులను రోజురోజుకు పెంచుతోంది. ఇది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏసీ బస్సు సర్వీసులకు విరామం ఇచ్చిన ఆర్టీసీ ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టింది. ఐసీఎంఆర్ శాస్త్రవేత్తకు కోవిడ్-19 పాజిటివ్, నీతిఆయోగ్ అధికారికి కరోనా, వారం రోజుల పాటు ఢిల్లీ రాష్ట్ర సరిహద్దుల మూసివేత, దేశ రాజధానిలో 19,000కు చేరువలో కరోనా కేసులు
విజయవాడ నుంచి విశాఖకు ఇంద్ర ఏసీ బస్సు సర్వీసును (Indra AC Bus Services) ప్రారంభించింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఏసీ బస్సు సర్సీసులను విశాఖ సహా తిరుపతి, కడప, కర్నూలు ప్రాంతాలకు నడపాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.
కృష్ణా రీజియన్ నుంచి రెండు మూడు రోజుల క్రితం వరకు దాదాపు 200 బస్సులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడపగా సోమవారం నాటికి వీటి సంఖ్యను 308కి పెంచింది. వీటిలో పల్లె వెలుగు బస్సులకు ఆదరణ లేకపోయినా దూర ప్రాంత బస్సులకు మాత్రం డిమాండ్ బాగుంది. వీటిలో డిమాండ్ ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, రాజమండ్రి రూట్లకు ఎక్కువ బస్సులు నడుపుతోంది. 24 గంటల్లో 204 మంది మృతి, 5,598కు చేరిన కోవిడ్-19 మరణాలు, దేశంలో 198,706కు పెరిగిన కరోనా కేసులు, 40 వేల మార్కును దాటిన ముంబై
ఆర్టీసీ బస్సు సర్వీసులకు అనుమతిచ్చాక ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకు బస్సులు తిరిగాయి. తాజాగా ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు బస్సులను నడుపుతున్నారు. అయితే పల్లెవెలుగు బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. ఇప్పటికే సగం సీట్లను కుదించినా వీటిలోనూ సగం మంది కూడా ప్రయాణించడం లేదు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పల్లెవెలుగు సర్వీసులను నడుపుతున్నారు. మరీ ఆదరణ లేని రూట్లలో మాత్రమే సర్వీసులను రద్దు చేస్తున్నారు.