Delhi Lockdown 5.0: ఐసీఎంఆర్‌ శాస్త్ర‌వేత్త‌కు కోవిడ్-19 పాజిటివ్, నీతిఆయోగ్‌ అధికారికి కరోనా, వారం రోజుల పాటు ఢిల్లీ రాష్ట్ర సరిహద్దుల మూసివేత, దేశ రాజధానిలో 19,000కు చేరువలో కరోనా కేసులు
Arvind Kejriwal (Photo Credits: ANI)

New Delhi, June 1: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ (Delhi Coronavirus) కల్లోలం ఆగడం లేదు, అక్కడ కేసులు 19,000కు చేరువ కాగా, మహమ్మారి బారినపడి 416 మంది మరణించారు. తాజాగా ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీస‌ర్చ్‌(ICMR)కు చెందిన సీనియర్‌ శాస్త్ర‌వేత్త‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈయన ముంబై ఐసీఎంఆర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ రీప్రోడెక్టివ్‌ హెల్త్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గతవారం ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ పాల్గొన్న ఓ సమావేశానికి ఈ శాస్త్రవేత్త హాజరయ్యారు.

దీంతో ఢిల్లీలోని ఐసీఎంఆర్‌ కార్యాలయ భవనాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నారు. కార్యాలయం మూతపడటంతో ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించారు. దేశంలో కరోనా కల్లోలం, ఆసియాలో అగ్రస్థానంలోకి భారత్, దేశ వ్యాప్తంగా 2 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ప్రధాని మోదీ

మరో ప్రభుత్వ కార్యాలయమైన నీతిఆయోగ్‌లో (Niti aayog)ఓ అధికారికి కరోనా వైరస్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో కార్యాలయంలో మూడో అంతస్ధును సోమవారం మూసివేశారు. ఈ ఫ్లోర్‌లో శానిటైజేషన్‌ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు గత వారం నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షలో పాజిటివ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారు పనిచేసే డివిజన్లలోని ఉద్యోగులందరినీ 14 రోజుల పాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లాలని, ఇంటి నుంచే పనిచేయాలని అధికారులు సూచించారు. మండే ఎండలకు బై..బై, కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు, దేశ వ్యాప్తంగా 102శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపిన వాతావారణ శాఖ

ఐదో విడత లాక్‌డౌన్‌ (Delhi Lockdown 5.0) నేపథ్యంలో దేశ రాజధానిలో భారీగా సడలింపులు ఇస్తూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (CM Arvind Kejriwal) నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సెలూన్లు, స్పాలు తెరుచుకోడానికి అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని రకాల దుకాణాలను తెరుచుకోడానికి అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. అన్‌లాక్‌ 1.0 లో భాగంగా కేంద్రం అనుమతించిన అన్ని సడలింపులను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తుందని ఢిల్లీ సీఎం అన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల పాటు రాష్ట్ర ఢిల్లీ సరిహద్దుల మూసివేత కొనసాగుతుందన్నారు. కేవలం అత్యవసర సరుకుల వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ముంబైకి మరో పెను ముప్పు, కరోనా వేళ విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్, మొత్తం నాలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్, మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ

సరిహద్దులను తెరిచే విషయంలో ప్రజల నుంచి సూచనలు స్వీకరించిన తరువాత ఒక వారంలో మళ్లీ నిర్ణయం తీసుకుంటామన్నారు. సరిహద్దుల విషయంలో ప్రభుత్వానికి సలహాలు అందిచాల్సిన ఢిల్లీ ప్రజలు 8800007722 నెంబర్‌కు శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు వాట్సాప్‌ లేదా మెయిల్‌ చేయాలని కోరారు. అలాగే ఉత్తర ప్రదేశ్, హర్యానాతో సరిహద్దులను తెరవడంపై ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సలహాలు కోరింది.

లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన రంగాలను దశలవారీగా తిరిగి ప్రారంభించడానికి కేంద్రం ఇటీవల వివరణాత్మక మార్గదర్శకాలను వెల్లడించిన విషయం తెలిసిందే. నిర్దిష్ట కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో భారీ సడలింపులు కూడా ప్రకటించింది. కాగా భారత్‌లో కరోనా కేసులు రెండు లక్షలకు చేరువలో ఉండగా, 5,300 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.