COVID-19 in India: దేశంలో కరోనా కల్లోలం, ఆసియాలో అగ్రస్థానంలోకి భారత్, దేశ వ్యాప్తంగా 2 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ప్రధాని మోదీ
Coronavirus Outbreak in China (Photo Credits: IANS)

New Delhi, June 1: భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య (COVID-19 in India) భారీగా పెరిగిపోతోంది. కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్రస్థానంలోకి చేరింది. ప్రభుత్వం ఓ వైపు లాక్‌డౌన్‌ నిబంధనలను (Lockdown Relaxation) మరింతగా సడలిస్తూ పోతుండగా, మరోవైపు అంతే వేగంగా కరోనా మహమ్మారి (Coronavirus) విస్తరిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8392 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ ప్రభావంతో 230 మంది మృతిచెందారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 1,90,535కి పెరిగింది.  జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు, లాక్‌డౌన్‌ 5.0 మార్గదర్శకాలు, అనుమతించేవి, అనుమతించనవి ఓ సారి తెలుసుకోండి

ఇందులో 93,322 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 91,819 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశంలో ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 5394కు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ 7వ స్థానానికి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు విడుదల చేసింది.

ప్రపంచంలో తొలి ఆరు స్థానాల్లో వరుసగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా, స్పెయిన్‌, బ్రిటన్‌, ఇటలీ దేశాలు ఉన్నాయి. ఈ వివరాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 65,168 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రజలకు తీపి కబురు, జూన్ 10న తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు, రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం

దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కరోనా ప్రబలకుండా మరింత జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా నిరోధంలో ప్రజలు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. ఆదివారం ఆయన మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా తన మనసులోని మాటలను దేశప్రజలతో పంచుకొన్నారు. అందరూ కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులను ధరించాలని సూచించారు. కరోనాపై పోరును ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనపర్చవద్దని కోరారు. కరోనా కారణంగా నిరుపేదలు, కూలీలు పడ్డ బాధలను మాటల్లో వర్ణించలేమని ఆయన అన్నారు. వారిని ఆదుకోవడానికి ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామీణ, స్వయం ఉపాధికి అవకాశాలను మెరుగుపరుస్తుందని, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి దోహపడుతుందని చెప్పారు.

కరోనా వైరస్‌ శ్వాసవ్యవస్థను దెబ్బతీస్తుందని, యోగా ద్వారా శ్వాసకోశ వ్యాధులను అధిగమించవచ్చని తెలిపారు. కరోనా గురించి ఇతర దేశాల నాయకులతో చర్చిస్తున్న సమయంలో వారు కూడా యోగా గురించి అడుగుతున్నారని చెప్పారు. నిరుపేదలకు ఆయుష్మాన్‌ భారత్‌ వరంగా మారిందన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు కోటి మందికి పైగా చికిత్స పొందారని చెప్పారు. మిడతలను నిరోధించడానికి పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.