Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, June 2: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య (Coronavirus in India) రోజురోజూకూ పెరిగిపోతూనే ఉంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల తర్వాత వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 8171 తాజా కేసులు (COVID 19 Cases) వెలుగుచూడటంతో మంగళవారం నాటికి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,98,706కు చేరింది. దేశంలో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది. గడచిన 24 గంటల్లో మరో 204 మంది చనిపోవడంతో (COVID-19 Deaths in India) మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,598కు చేరింది. మండే ఎండలకు బై..బై, కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు, దేశ వ్యాప్తంగా 102శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపిన వాతావారణ శాఖ

ప్రస్తుతం దేశంలో 97,581 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 95,526 డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఢిల్లీలో మరణాలు గణనీయంగా పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 62,65,496 కరోనా కేసులు నమోదయ్యాయి.

కాగా దేశంలో నమోదు అవుతున్న కోవిడ్-19 కేసుల్లో మూడో వంతు కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. రాజధాని ముంబై సహా అనేక ప్రాంతాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. తాజాగా 2,361 కేసులతో మహారాష్ట్రలో కేసుల సంఖ్య 70 వేలకు దాటింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 70,013లకు చేరాయని సోమవారం సాయంత్రం ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక తాజాగా 76 మరణాలతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 2,362కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,543 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కోవిడ్-19 బారిన బాధితుల్లో 30,108 మంది కోలుకున్నారు. సోమవారం ఒక్కరోజే 779 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్-19 టెస్టులు బాగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4,71,473 టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కేసుల సంఖ్య 40 వేల మార్కును దాటి 41,099కి చేరాయి. ప్రస్తుతం ముంబైలో 22,789 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ముంబైకి మరో పెను ముప్పు, కరోనా వేళ విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్, మొత్తం నాలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్, మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ

తమిళనాడు రాష్ట్రంలో సోమవారం 1162 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 23,495కు పెరిగింది. చెన్నైలో సోమవారం 964 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో రాజధానిలో బాధితుల సంఖ్య 15,770కు పెరిగింది. రాష్ట్రంలోని 43 ప్రభుత్వ ఆస్పత్రులు, 28 ప్రైవేటు ల్యాబ్‌లు, చెన్నై సీడీ హాస్పిటల్‌లోని ప్రభుత్వ ల్యాబ్‌లో ఇప్పటి వరకు 5,03339 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. సోవవాఆరం 1162 మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. సోమవారం కరోనాతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా వుండగా రాష్ట్రంలో అంత్యక్రియలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారి సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి అంత్యక్రియలలో పాల్గొనేందుకు 20 మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. కాగా ఆ సంఖ్యను 50కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. చెన్నైలో సోమవారం 48 జాతీయ విమాన సర్వీసులు నడిపారు. వాటిలో సుమారు ఐదు వేలమంది వరకు ఇతర నగరాలవైపు ప్రయాణించారు.