AP Coronavirus: ఇది నిజంగా సంచలనమే, 80 ఏళ్ల బామ్మ కరోనాని జయించింది, ఏపీలో తాజాగా 50 కేసులు నమోదు, 3,427కి చేరిన మొత్తం కరోనా కేసులు
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Amaravati, June 5: ఏపీలో గడిచిన 24 గంటల్లో(గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు) 9,831 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కేవలం 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 21 మంది కరోనా (AP Coronavirus) నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,294కు చేరింది. వైరస్‌తో (COVID-19) నిన్న ఇద్దరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,427 కేసులు నమోదవ్వగా, 73 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు. ప్రస్తుతం 1,060 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో భారత్‌లో 9,851 కేసులు, దేశంలో మొత్తం 2,26,334 పాజిటివ్‌ కేసులు, ఆందోళన కలిగిస్తున్న మహారాష్ట్ర

కర్నూలుకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కరోనా మీద గెలిచింది. గురువారం ఆమెతో పాటు మరో ఆరుగురు కరోనావైరస్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలు జీజీహెచ్‌ స్టేట్‌ కోవిడ్‌ ఆసుపత్రి నుంచి ముగ్గురు, నంద్యాల శాంతిరామ్‌ జిల్లా స్థాయి ప్రభుత్వ కోవిడ్‌ ఆసుపత్రి నుంచి నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. వీరిలో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి 80 ఏళ్ల వృద్ధురాలు డిశ్చార్జ్‌ కావడం విశేషం.