Coronavirus in India: గత 24 గంటల్లో భారత్‌లో 9,851 కేసులు, దేశంలో మొత్తం 2,26,334 పాజిటివ్‌ కేసులు, ఆందోళన కలిగిస్తున్న మహారాష్ట్ర

భారత్‌లో కోవిడ్ 19 (Coronavirus in India)విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రతి రోజు 200 పైగా సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 10 వేల కేసులు ( Coronavirus Cases) వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 9,851 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 273 మంది మృత్యువాత పడ్డారు. ఒకేరోజు ఈ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటి వరకు దేశంలో 2,26,770 కరోనా కేసులు నమోదవ్వగా, 6,348 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి కోలుకొని 1,09,462 మంది డిశ్చార్జి అయ్యారు.

Coronavirus in India: గత 24 గంటల్లో భారత్‌లో 9,851 కేసులు, దేశంలో మొత్తం 2,26,334 పాజిటివ్‌ కేసులు, ఆందోళన కలిగిస్తున్న మహారాష్ట్ర
Coronavirus in India (Photo Credits: PTI)

Mumbai, June 5: భారత్‌లో కోవిడ్ 19 (Coronavirus in India)విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రతి రోజు 200 పైగా సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 10 వేల కేసులు ( Coronavirus Cases) వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 9,851 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 273 మంది మృత్యువాత పడ్డారు. ఒకేరోజు ఈ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటి వరకు దేశంలో 2,26,770 కరోనా కేసులు నమోదవ్వగా, 6,348 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి కోలుకొని 1,09,462 మంది డిశ్చార్జి అయ్యారు. ఒడిశాను మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు, జూన్‌ 10 నుంచి ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, వెల్లడించిన వాతావరణ శాఖ

ఒక్క మహారాష్ట్రలోనే (Maharashtra) అత్యధికంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 77,793కు చేరుకుంది. గురువారం ఒక్క రోజే 123 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని నగరం ఢిల్లీలో కొత్తగా1359 కేసులు నమోదుకాగా..మొత్తం కేసులు 25వేలకు పైగా నమోదయ్యాయి.

ఇక కోవిడ్‌ కేసులు నమోదయిన దేశాల్లో భారత్‌ 7వ స్థానంలో నిలిచింది. మొదటి ఆరు స్థానాల్లో వరుసగా అమెరికా, బ్రెజిల్‌,రష్యా, యూకే, స్పెయిన్‌, ఇటలీ ఉన్నాయి. అదే విధంగా మరణాల విషయానికొస్తే భారత్‌ 12వ స్థానంలో ఉంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారిలో 8వ స్థానంలో కొనసాగుతోంది.

(The above story first appeared on LatestLY on Jun 05, 2020 10:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).