Heavy Rains To Hit Telugu States in Next 2 Days (Photo-Twitter)

New Delhi, June 5: వచ్చే 24 గంటల్లో తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం అంచనా వేసింది. కాగా ఒడిశాలో (Odisha) మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) (India Meteorological Department (IMD) గురువారం ప్రకటించింది. ఇప్పటికే అంఫాన్‌ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలను చవిచూసిన ఒడిశాను ఇప్పుడు మరో తుఫాను ముంచెత్తే అవకాశం ఉన్నదని ఐఎండీ వెల్లడించింది. దేశ ప్రజలను కలిచివేస్తోన్న ఏనుగు మరణం, ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు జరుపుతున్నామని తెలిపిన కేరళ సీఎం, ట్వీట్ చేసిన రతన్ టాటా

IMD తన తాజా బులెటిన్లో, పశ్చిమ హిమాలయ ప్రాంతం మరియు వాయువ్య భారతదేశం యొక్క ప్రక్కనే ఉన్న మైదానాలయిన పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.

జూన్‌ 8వ తేదీ కల్లా దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో జూన్‌ 10 నుంచి ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మే నెల ఆఖరులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం అంఫాన్‌ తుఫానుగా మారి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరప్రాంతాల్లో తీరాన్ని తాకింది. తీరాన్ని తాకిన అంఫాన్, అల్లకల్లోలంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరప్రాంతాలు, రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ వర్షాలవల్ల రెండు రాష్ర్టాల్లో తీవ్ర పంటనష్టం వాటిల్లింది. పలుచోట్ల ఆవాసాలు నీట మునిగాయి. కాగా, ప్రాణ నష్టం పరంగా చూస్తే మాత్రం ఒడిశాలో అంఫాన్‌ ప్రభావం పెద్దగా పడలేదు. ఐదు మరణాలతో ఆగిపోయింది. కానీ, బెంగాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఆ రాష్ట్రంలో అంఫాన్‌ దాదాపు 76 మందిని పొట్టనపెట్టుకుంది.  విధ్వంసం సృష్టించిన అంఫాన్, వెస్ట్ బెంగాల్,ఒడిషాలో భారీగా ఆస్తి నష్టం, నీటిలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు, వీడియోల్లో విధ్వంసం ఎలా ఉందో మీరే చూడండి

ఢిల్లీ వాసులకు జూన్ 10 వరకు హీట్ వేవ్ ఉండే అవకాశం లేదని IMD పేర్కొంది. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మొత్తం కేరళ, మాహే, కర్ణాటకలోని కొన్ని భాగాలు, కొమొరిన్ ప్రాంతం మరియు నైరుతి బంగాళాఖాతంలోకి మరింతగా ముందుకు వచ్చాయని IMD తెలిపింది.

వాతావరణ శాఖ ప్రకారం, ఉత్తర భారతదేశానికి ఈ సంవత్సరం "సాధారణం కంటే ఎక్కువ" వర్షపాతం వచ్చే అవకాశం ఉండగా, మధ్య భారతదేశం మరియు దక్షిణ ద్వీపకల్పంలో "సాధారణ" వర్షపాతం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు జూన్ 1 న కేరళను తాకింది.