Amphan Cyclone (Photo credits: IMD)

Odisha, May 20: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అంఫన్ తుపాను తీరాన్ని (Amphan Cyclone) తాకింది. పశ్చిమబెంగాల్‌లోని దిఘా బంగ్లాదేశ్ హతియా దీవుల మధ్య తీరాన్ని తాకిందని భారత వాతావరణ విభాగ అధికారులు(IMD) తెలిపారు. నాలుగు గంటల పాటు బెంగాల్‌పై తుపాను ప్రభావం ఉంటుందన్నారు. ఆంఫన్ కారణంగా పశ్చిమబెంగాల్‌లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 165 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని అధికారులు చెప్పారు. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వైపు అంఫాన్ తుఫాను, ఒడిశా, పశ్చిబెంగాల్‌ మధ్యలో తీరం దాటే అవకాశం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం

ప్ర‌స్తుతం ఆ తుఫాన్ బాల‌సోర్ వ‌ద్ద కేంద్రీకృత‌మై ఉన్న‌ద‌ని, మ‌రో నాలుగు గంట‌ల్లో అది తీరాన్ని పూర్తిగా దాటేస్తుంద‌ని, దీంతో ఆ ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స్పెష‌ల్ రిలీఫ్ క‌మిష‌న‌ర్ ప్ర‌దీప్ కుమార్ జెనా తెలిపారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.30 నిమిషాల‌కు తుఫాన్ తీరాన్ని తాక‌డం ప్రారంభ‌మైన‌ట్లు చెప్పారు. అయితే ఈ ప్ర‌క్రియ ఓ నాలుగు గంట‌ల పాటు ఉంటుంద‌న్నారు. భ‌ద్ర‌క్‌లో ఒక‌రు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు.

NDRF Clear Electricity wires & uprooted trees

Here's ѕαtчα prαdhαn Tweet

తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఒడిశాలో లక్షా 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమబెంగాల్‌లో 5 లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించారు. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌ను గురువారం సాయంత్రం దాకా మూసేశారు. రెండు రాష్ట్రాల్లో 41 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

తుఫాన్ వ‌ల్ల ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ వ‌ద్ద బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. అక్క‌డ భారీ వ‌ర్షాలు కూడా కురుస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF) ద‌ళాలు.. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా, ఒడిశా బోర్డ‌ర్ వ‌ద్ద రోడ్డుపై వృక్షాలు నేల‌కూలాయి. విద్యుత్తు స‌ర‌ఫ‌రా కూడా నిలిచిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు.

ఫ‌ణి తుపాన్ అనుభ‌వాల ఆధారంగా.. అన్ని బృందాల‌ను యాక్టివ్‌గా ఉంచామ‌ని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్ర‌ధాన్ తెలిపారు. ట్రీ క‌ట్ట‌ర్లు, పోల్ క‌ట్ట‌ర్లు అందుబాటులో ఉంచామ‌న్నారు. బెంగాల్‌లో మొత్తం 5 ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ఒడిశాలో కూడా ల‌క్ష‌న్న‌ర మందిని త‌ర‌లించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.