Kerala Elephant Tragedy: దేశ ప్రజలను కలిచివేస్తోన్న ఏనుగు మరణం, ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు జరుపుతున్నామని తెలిపిన కేరళ సీఎం, ట్వీట్ చేసిన రతన్ టాటా
Pregnant Elephant Dies After Eating Firecracker-Filled Kerala's Pineapple (Photo Credits: ANI)

New Delhi, June 4: కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పేలుడు పదార్థాలు ఉన్న పైనాపిల్‌ను తినిపించి మరణానికి (Kerala Elephant Tragedy) కారణమైన ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ దారుణానికి బాధ్యులైన వారిని ఎవరిని వదలమని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ (Minister Prakash Javadekar) హెచ్చరించారు. నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమని పేర్కొంది. బాణాసంచా తినిపించి చంపడం భారతీయ సంస్కృతి కాదని (Not Indian culture) కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. ఈ ఘటన మలప్పురంలో జరిగిందని.. ఏనుగు పాలక్కడ్‌లో మృతి చెందిందని జవదేకర్‌ తెలిపారు.  ఏనుగుతో పాటు కడుపులో బిడ్డను చంపేశారు, బాణసంచా కూర్చిన పైనాపిల్‌ తిని కేరళలో ఏనుగు మృతి, ఎఫ్‌‌ఐఆర్ నమోదు

అటవీశాఖ అధికారి మోహన్‌ కృష్ణ తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసిన ఓ ఎమోషనల్ నోట్ నెటిజనులను కదిలిస్తోంది. ‘మేము చూసినప్పుడు ఆ ఏనుగు తలను నీటిలో ముంచి నిలబడి ఉంది. చనిపోతున్నట్లు దానికి అర్థమైనట్లుంది. అందుకే నదిలో నిలబడి జలసమాధి అయ్యింది’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాక నొప్పికి తాళలేక వీధుల వెంట పరిగెడుతున్నప్పుడు ఆ ఏనుగు ఒక్కరికి కూడా హానీ చేయలేదని తెలిపారు.

Here's Prakash Javadekar Tweet

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గురువారం తెలిపారు. ఘటనతో సంబంధముందని భావిస్తున్న ముగ్గురు అనుమానితులపై ప్రత్యేకంగా దృష్టిసారించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘పాలకడ్‌లో జరిగిన ఘటన చాలా విషాదకరమని ఓ ఏనుగు నిండు ప్రాణం కోల్పోయిందని ఆవేదనగా ట్వీట్‌ చేశారు.

Here's Kerala CM Tweet

ఘటనపై పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు, అటవీశాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారని, సాధ్యమైనంత త్వరగా కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అపరాధులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, మానవులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ పెరుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఏనుగు మృతికి కారణమైన వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్పందిస్తూ.. అమాయక ఏనుగును క్రూరంగా అంతమొందించిన ఘటన తనని కలచివేసిందన్నారు. అమాయక జంతువుల హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహం, శ్రద్ధాకపూర్‌, రణ్‌దీప్‌ హుడా డిమాండ్‌ చేశారు.

Here's Ratan Tata Tweet

క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు స్పందిస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఏనుగు ప్రాణం తీసిన నిందితుల ఆచూకీ తెలిపితే రూ. 50 వేలు ఇస్తామని హ్యుమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ఆఫ్‌ ఇండియా బహుమతి ప్రకటించింది.

కేరళలోని మలప్పురంలో ఏనుగు మృతి చెందిన ఘటనపై గోరఖ్‌పూర్‌ ఎంపీ, నటుడు రవికిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏనుగుతోపాటు దాని బిడ్డను కూడా చంపి..క్షమించరాని పాపం చేశారు. ఈ ఘటనలో ఎంతమంది ప్రమేయం ఉన్నా వారందరికీ కఠినంగా శిక్ష విధించాలని పోలీసులను ఎంపీ రవికిషన్ కోరారు. నేను జంతు ప్రేమికుడిని. హిందూమతంలో ఏనుగులను పూజిస్తారు. ఏనుగును చంపినవారిని ఉరి తీయాలని కేరళ ప్రభుత్వాన్ని ఎంపీ రవికిషన్ డిమాండ్ చేశారు.

Here's  MP Ravi Kishan Video

ఆహారం కోసం తిరుగుతున్న ఏనుగు ఓ పండును తిన్నది. అయితే ఆ పండులో పేలుడు పదార్థాలు ఉండటంతో దాని దవడలు, నోటికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధను తాళలేక సమీపంలోని ఓ నదిలోకి దిగింది. తన నోటిని నీటిలోకి ముంచి ఉపశమనాన్ని పొందింది. ఆహారం లేకపోవడం, గాయాల తీవ్రత ఎక్కువ కావడంతో గతనెల 27న ప్రాణాలు విడిచింది. ఏనుగుకు పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించగా అది నెలరోజుల గర్భిణి (Kerala Pregnant Elephant Killing) అని తేలింది. గాయాలతో ఉన్నప్పటికీ ఏనుగు ఎవరికీ హాని చేయలేదు. ఈ ఘటనపై కేరళ సర్కార్‌ దర్యాప్తునకు ఆదేశించింది. కేంద్రం రాష్ర్టాన్ని నివేదిక కోరింది.