Kerala, Aug 2: కేరళను ఓ వైపు వర్షం మరోవైపు కొండ చరియలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇక మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 316 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుండగా హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవ పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నట్లు డాక్టర్లు చెబుతుండటం కలచివేస్తోంది.
ఇక కేరళను ఆదుకునేందుకు పలువురు సినీ నటులు ముందుకొచ్చారు. కమల్ హాసన్, విక్రమ్, విజయ్ సహా చాలా మంది కోలీవుడ్ సినీ తారలు సోషల్ మీడియా ద్వారా వాయనాడ్ ప్రజలకు తమ మద్దతును అందించారు. నటులు సూర్య, జ్యోతిక & కార్తీ రూ. 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. కేరళల ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించారు.
వాయనాడ్ కొండచరియల బాధితుల సహాయార్థం నటుడు విక్రమ్ కేరళ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి రూ.20 లక్షల విరాళం అందించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విక్రమ్ మద్దతు అందించిన విక్రమ్ అభిమానులు అభినందిస్తున్నారు. వయనాడ్ విషాదం మా మనసుల్ని కలిచి వేసింది.. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదు అని తెలిపారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందించడమే మా ప్రాధాన్యం.. మా నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధ పడ్డానో.. ఇప్పడు అంతే బాధ కలుగుతోందని వెల్లడించారు. వయనాడ్‌లో ఆగని మృత్యుఘోష, వరదలో కొట్టుకువస్తున్న మృతదేహాలు, 281కి పెరిగిన మరణించిన వారి సంఖ్య, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ |