Dr BR Ambedkar Konaseema: కోనసీమ జిల్లా పేరు మారింది, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప‍్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా ( Konaseema) పేరును మార్చింది. జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా (Dr BR Ambedkar Konaseema) పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది
ఆంధ్రప‍్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా ( Konaseema) పేరును మార్చింది. జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా (Dr BR Ambedkar Konaseema) పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచిన సంగతి తెలిసిందే.. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. అయితే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి వినతులు అందాయి.. దీంతో సానుకూలంగా స్పందించి పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇకపై నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, కరెంట్ కోతలు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన జగన్ సర్కారు
అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే ఈ జిల్లాకు డా.బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీని కోసం పలుచోట్ల నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. దీంతో కోనసీమ జిల్లా పేరులో డా.బి.ఆర్.అంబేద్కర్ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మార్పుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.
(The above story first appeared on LatestLY on May 18, 2022 05:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

