Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇకపై నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, కరెంట్ కోతలు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన జగన్ సర్కారు
CM-YS-jagan-Review-Meeting

Amaravati, May 18: ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు (YS Jagan Govt lifts power holiday) ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మే 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరణ (lifts power holiday for industries) కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీ లో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం (YS Jagan Govt) తెలిపింది.

బొగ్గు సమస్యతో ఏప్రిల్ 7 నుంచి పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించింది ప్రభుత్వం. వారంలో ఒక రోజు పవర్‌ హాలిడే ప్రకటించింది. అయితే ఈ నెల 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలీ డే కూడా ఎత్తివేసింది. ఇకపై అన్ని రంగాలకు 100 శాతం విద్యుత్ సరఫరా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు నిల్వలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్సన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం, జీఏడీలో రిపోర్టు చేయాలని సూచన, ఫిబ్రవరి 8 నుంచి ఆయనకు జీతభత్యాలను ఇవ్వాలని జీఏడీకి సీఎస్ ఆదేశాలు జారీ

కర్ణాటక, కేరళలో కురిసిన వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని జలాశయాలకు నీటి రాక పెరిగింది. మెట్టూరు, భవానీసాగర్, ముల్లైపెరియార్ తదితర జలాశయూల్లో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడింది. దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి పెరిగింది.