Free Ration Distribution: రెండవ ధపా ఉచిత రేషన్ సరఫరా, టైం స్లాట్‌తో కూడిన కూపన్లు, వలంటీర్ల ద్వారా కార్డుదారులకు కూపన్లు
లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలను ఆడుకోవడానికి ఏపీ ప్రభుత్వం (AP Govt) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే ఇప్పటికే ఉచిత రేషన్ బియ్యాన్ని (Free Ration Distribution) సరఫరా చేయాలనీ, అంతేకాకుండా ప్రతి ఇంటికి 1000 రూపాయలను అందజేయాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం రెండో విడత ఉచితంగా పంపిణీ చేయనున్న రేషన్ సరుకులను నేటి నుంచి వాలంటీర్లు అందిస్తున్నారు.
Amaravati, April 16: లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలను ఆడుకోవడానికి ఏపీ ప్రభుత్వం (AP Govt) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే ఇప్పటికే ఉచిత రేషన్ బియ్యాన్ని (Free Ration Distribution) సరఫరా చేయాలనీ, అంతేకాకుండా ప్రతి ఇంటికి 1000 రూపాయలను అందజేయాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం రెండో విడత ఉచితంగా పంపిణీ చేయనున్న రేషన్ సరుకులను నేటి నుంచి వాలంటీర్లు అందిస్తున్నారు.
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ వివాదం, ఏపీ డీజీపీకి విజయసాయి రెడ్డి లేఖ
కాగా ఉచిత రేషన్ బియ్యాన్ని మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 29 వరకు మూడు విడతలగా రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (AP CM YS Jagan) నిర్ణయించిన సంగతి విదితమే. ఇప్పటికే మార్చి 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం మొదటి విడతగా కార్డులో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. నేటి నుంచి రెండో విడత సరుకులను లబ్దిదారులకు పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ విడతలో రేషన్ బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా అందించనున్నారు. దీనిద్వారా రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలకు లబ్ది చేయనున్నారు.
ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు భారీ షాక్, ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ కొత్త ఆర్డినెన్స్
ఇప్పటికే దీనికి సంబంధించిన రేషన్ షాపులకు సరుకులు ఇప్పటికే చేరుకున్నాయి. ఇక సురక్షితమైన ప్రాంతంలో సరుకులను ప్రజలకి అందించేలా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంది. ఈసారి రేషన్ షాపుల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా లబ్ధిదారులకు టైం స్లాట్‌తో కూడిన కూపన్లు జారీ చేశారు. వలంటీర్ల ద్వారా ఈ కూపన్లను కార్డుదారులకు అందిస్తున్నారు. ఆ కూపన్లపై రేషన్ షాపు, తేదీ, సరుకులు తీసుకునే సమయం వివరాలు ముద్రించి ఉంటాయి. ఇక ఏపీలో కరోనా వైరస్ కేసుల విషయానికి వచ్చేసరికి నిన్న కొత్తగా 15 కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420 కి చేరింది.
ఈసారి రేషన్ షాపుల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా లబ్ధిదారులకు టైం స్లాట్‌తో కూడిన కూపన్లు జారీ చేశారు. వలంటీర్ల ద్వారా కూపన్లను కార్డుదారులకు అందిస్తున్నారు.కూపన్లపై రేషన్ షాపు, తేదీ, సరుకులు తీసుకునే సమయం వివరాలు ముద్రించి ఉంటాయి. లబ్దిదారులు వేలిముద్ర వేయకుండా వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారా రేషన్ సరుకులు ఇస్తారు. రాష్ట్రంలోని 14,315 రేషన్ షాపుల్లో ఎక్కువ కార్డులు ఉన్న చోట్ల రద్దీని నియంత్రించేందుకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
8 వేల రేషన్ షాపుల్లో సింగిల్ కౌంటర్, 3,800 షాపుల్లో రెండు కౌంటర్లు, 2,500 షాపుల్లో అదనంగా 3 కౌంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు.రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉంటే 92 లక్షల కార్డులకే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోంది. మిగిలిన 55 లక్షల కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించి ఉచితంగా బియ్యం, కేజీ శనగలను అందిస్తోంది. బియ్యం కార్డులు పొందేందుకు అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న పేదలకు కూడా ఉచిత సరుకులు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. లాక్‌డౌన్ వల్ల పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న లక్షల మంది కార్డుదారులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోని రేషన్ దుకాణం ద్వారా సరుకులు పొందేందుకు కూపన్లు జారీ చేశారు.
కరోనా వైరస్ వల్ల రెడ్ జోన్‌గా ప్రకటించిన చోట్ల సురక్షిత ప్రాంతంలో సరుకులు అందించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీలైతే ఇంటింటికీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రేషన్ అందకపోవడం, ఇతర ఇబ్బందులు ఎదురైతే 1902 నంబర్‌కి కాల్ చేస్తే అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారు.
(The above story first appeared on LatestLY on Apr 16, 2020 02:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

