Amaravati, April 16: రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై వివాదం (Nimmagadda Letter Row) కొనసాగుతోంది. తాజాగా ఈ లేఖపై విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (YSRCP Mp Vijaya Sai Reddy) డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కి (Gowtham sawang) రాసిన లేఖ రాశారు. ఈ లేఖలో సంతకం తేడాగా ఉందని నిజనిజాలు తేల్చాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు భారీ షాక్, ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ కొత్త ఆర్డినెన్స్
ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేశ్ కుమార్ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదన్నారు. సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా టీడీపీ ఆఫీసులోనే తయారయిందని తమ దగ్గర సమాచారం ఉన్నట్లు తెలిపారు. ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేశారని, ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, టీడీ జనార్థన్‌ల హస్తం ఉందని వెల్లడించారు. వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, అయితే ఈ తతంగమంతా రమేశ్ కుమార్‌కకు తెలిసే జరిగిందని విమర్శించారు.
నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్
ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని, దీనిపై వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు.
ప్రాణాలకు ముప్పుందంటూ లేఖ రాసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్
ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ లేఖ రాసిన తరువాత ఈ వ్యవహారంపై మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనని వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఆ లేఖ తానే రాసినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.
ఎన్నికల కమిషనర్‌గా తనకున్న అధికార పరిధిలోనే లేఖ రాసినట్లు తెలిపారు. ఆ లేఖపై ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కూడా దాన్ని నిర్ధారించారని గుర్తు చేశారు. దీనిపై ఎలాంటి ఆందోళన, సందేహాలు అవసరం లేదని, ఎలాంటి వివాదాలు, రాద్ధాంతాలకు తావులేదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
ఏపీలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తేయండి, ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఈసీ పరిధిలోనిదే- సుప్రీంకోర్ట్
కాగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఎస్ఈసీ రమేష్ కుమార్ పేరుతో రాసిన ఓ లేఖ మార్చి 18న వైరల్ అయిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.కాగా డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసిన కొన్ని గంటల్లోనే తానే లేఖ రాశానని మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రకటించడం గమనార్హం.