Madras High Court retired-judge-justice-v-kanagaraj-be-appointed-andhra-pradesh- sec (Photo-Twitter)

Amaravati,April 11: ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా (AP new State Election commissioner) రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నూతన ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ ( Justice V. KanagaRaj) శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు భారీ షాక్, ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ కొత్త ఆర్డినెన్స్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జిని (Retired Justice) నియమించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ప్రభుత్వం నియమించింది.

9ఏళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. విద్య, బాలలు, మహిళలు, వృద్ధుల సంక్షేమ అంశాలపై కనగరాజ్ కీలక తీర్పులు చేశారు. 1972లో మద్రాస్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1973లో సేలం బార్ అసోసియేషన్ సభ్యుడిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సీనియర్ సిటిజన్స్ కేసులు సత్వరం పరిష్కరించిన రికార్డ్ ఈయనకుంది. మద్రాస్ హైకోర్టు, మధురై బెంచ్‌లోనూ ఆయనకు పనిచేసిన అనుభవం ఉంది.

Justice V Kanagaraj took charge as AP SEC

 

తమిళనాడుకు చెందిన జస్టిస్‌ కనగరాజ్ మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ ప్రాణాలకు ముప్పుందా? 

ఏపీ ఎన్నికల అధికారిగా ఉన్న రమేశ్ కుమార్ కు ( Nimmagadda Ramesh kumar) ఏపీ ప్రభుత్వం ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఈ నియామకానికి సంబంధించిన విషయంలో రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీనిని గవర్నర్ కు పంపడం..ఆయన వెంటనే ఆమోదించడం..వెంటనే ఆర్డినెన్స్ పై జీవో జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. అనంతరం ఎన్నికల కమిషనర్ విధుల నుంచి రమేశ్ కుమార్ ను తప్పించింది. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని ఆక్షేపిస్తున్నాయి.