Visakhapatnam Horror: విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్.. కొంత కాలంగా బాధితురాలి షాపులో పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్న నిందితుడు
విశాఖలో ఘోరం చోటు చేసుకుంది. వరలక్ష్మి అనే 73 ఏండ్ల వృద్ధురాలిని వాలంటీర్ గా పని చేస్తున్న వెంకటేశ్ రాత్రి 10.30 గంటల సమయంలో హత్య చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు నిర్వహిస్తున్న షాప్ లో వెంకటేశ్ గత కొంత కాలంగా పార్ట్ టైమ్ వర్కర్ గా పని చేస్తున్నాడు.
Visakhapatnam, July 31: విశాఖలో (Visakhapatnam) ఘోరం చోటు చేసుకుంది. వరలక్ష్మి అనే 73 ఏండ్ల వృద్ధురాలిని వాలంటీర్ (Volunteer) గా పని చేస్తున్న వెంకటేశ్ రాత్రి 10.30 గంటల సమయంలో హత్య (Murder) చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు నిర్వహిస్తున్న షాప్ లో వెంకటేశ్ గత కొంత కాలంగా పార్ట్ టైమ్ వర్కర్ గా పని చేస్తున్నాడు.
ఒంటిపై ఉన్న బంగారం కోసం ..
వరలక్ష్మి ముఖంపై దిండుతో అదిమి, ఊపిరి ఆడకుండా చేసి నిందితుడు ఆమెను హత్య చేసినట్టు క్లూస్ టీమ్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం కోసమే వెంకటేశ్ ఈ హత్య చేసినట్టు భావిస్తున్నారు. నిన్న రాత్రి వృద్ధురాలు ఇంటికి వెంకటేశ్ వచ్చి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.
(The above story first appeared on LatestLY on Jul 31, 2023 10:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

