CM KCR Fire (photo-Twitter)

Hyderabad, July 31: తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరుగనున్నది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం (Cabinet) నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (KCR) నిర్ణయించిన సంగతి తెలిసిందే. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నది. సాగు పనులు, భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులపైనా చర్చించనున్నది. వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది.

Conjunctivitis in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కళ్ల కలక కేసులు.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న బాధితులు

కీలక అంశాలపై చర్చ కూడా..

ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల విస్తరణ, పెండింగ్ పనులు పూర్తి చేయడం వంటి వాటిపై కూడా క్యాబినెట్ లో చర్చించనున్నారు. గత ఎన్నికల సమయంలో నిరుద్యోగభృతి వంటి హామీలను కేసీఆర్ ఇచ్చారు. ఈనాటి సమావేశంలో వీటిపై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే కొత్త హామీలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. గృహలక్ష్మి, రెండో విడత దళితబంధు, బీసీలు, మైనార్టీలకు రూ. లక్ష ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు, పంట రుణాల మాఫీ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

IIT Bombay: ఐఐటీ బాంబే క్యాంటీన్ లో పోస్టర్ల కలకలం.. శాకాహారం తినేవాళ్లే ఇక్కడ కూర్చోవాలంటూ వెలిసిన పోస్టర్లు