Newdelhi, July 31: ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో (IIT Bombay) వెలిసిన పోస్టర్లు (Posters) కలకలం సృష్టిస్తున్నాయి. క్యాంపస్ (Campus) లో మాంసాహారం (Non-Veg) చిచ్చు రేగింది. మాంసాహారం తినే విద్యార్థులపై క్యాంటీన్ లో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. క్యాంపస్ లోని క్యాంటీన్ లో మాంసాహారం తిన్న ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానించడంతో ఈ వివాదం మొదలైంది. శాకాహారం తినేవారిని మాత్రమే ఇక్కడ కూర్చునేందుకు అనుమతిస్తామని క్యాంటీన్ గోడలపై కొన్ని పోస్టర్లు దర్శనమిచ్చాయి. అంతేకాదు, మాంసాహారం తినే విద్యార్థులు ఎవరైనా అక్కడ కూర్చుంటే అక్కడ్నించి వారిని బలవంతంగా తరలిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
'Vegetarians only': IIT Bombay students allege food discrimination at hostel canteen, secretary responds https://t.co/yhL9OHg35j
— Animalplanet (@Animalplan69) July 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)