Hyderabad Crime Case: హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి.. పాస్ పోర్టు కోసం నగరానికి వచ్చిన మణిరాజ్.. స్నేహితుడి ఇంటికి వెళ్లి బాత్రూంలో అనుమానాస్పద మృతి.. మృతుడు వరంగల్ వాసిగా గుర్తింపు
వరంగల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హైదరాబాద్ లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాస్‌పోర్టు తీసుకునేందుకు త్రిపురాది మణిరాజ్ (30) తండ్రి నవీన్‌కుమార్ తో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత
Hyderabad, July 31: వరంగల్ కు (Warangal) చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ (Software Engineer) హైదరాబాద్ (Hyderabad) లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాస్‌పోర్టు (Passport) తీసుకునేందుకు త్రిపురాది మణిరాజ్ (30) తండ్రి నవీన్‌కుమార్ తో కలిసి ఈ నెల 28న హైదరాబాద్ వచ్చాడు. పని పూర్తయ్యాక అదే రోజు సాయంత్రం నవీన్ కుమార్ తిరిగి వరంగల్ వెళ్లిపోగా, మణిరాజ్ అల్కాపూర్‌లో ఉండే స్నేహితుడు కొత్త చాణక్య ఇంటికి వెళ్లాడు. మణిరాజ్ తర్వాతి రోజు స్నేహితులతో కలిసి వెస్ట్ మారేడ్ ప్లలిలోని గణేశ్ ఆలయం, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవాలయాన్ని దర్శించుకున్నాడు. అనంతరం జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ కు వెళ్లాడు. అక్కడి నుంచి మణిరాజ్ నేరుగా చాణక్య ఇంటికి చేరుకున్నాడు. నిన్న ఉదయం అపార్ట్ మెంట్ మీటింగ్ ఉండడంతో బాత్రూంలో ఉన్న స్నేహితుడికి చెప్పి చాణక్య వెళ్లాడు.
కనిపించకపోవడంతో..
మీటింగ్ పూర్తయ్యాక 11.30 గంటలకు తిరిగి వచ్చాక మణిరాజ్ కనిపించకపోవడంతో బాత్రూం తలుపు తట్టాడు. అయినా స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగువారిని పిలిచి తలుపులు బద్దలుకొట్టి చూడగా మణిరాజ్ మృతి చెంది కనిపించాడు. విషయాన్ని చాణక్య వెంటనే ఆయన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 31, 2023 08:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

