Newdelhi, July 31: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దాహం తీర్చుకునేందుకు మంచి నీళ్లు (Drinking Water) ఇవ్వాలని అడిగిన ఓ దివ్యాంగుణ్ణి ఇద్దరు జవాన్లు (Jawans) చావచితక కొట్టిన ఘటన దేవరీయా ప్రాంతంలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, 2016లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో సచిన్ (Sachin) అనే వ్యక్తి తన రెండు కాళ్లూ కోల్పోయాడు. అయినప్పటికీ, పొట్టపోసుకోవడానికి ప్రస్తుతం అతడు స్థానిక రెస్టారెంట్ లో డెలివరీబాయ్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, శనివారం రాత్రి తన వాహనంపై ఇంటికి బయలుదేరిన అతడికి రోడ్డు మీద ఓ తాబేలు కనిపించింది. అతడు దాన్ని తీసుకుని ఆలయ సమీపంలోని కొలనులో విడిచిపెట్టాడు. ఆ తరువాత అక్కడ కనిపించిన ఇద్దరు ప్రాంతీయ రక్షక్ జవాన్లను మంచినీళ్లు అడిగాడు.
Two security officials in Uttar Pradesh's #Deoria have been suspended after a video of them assaulting a disabled man went viral.https://t.co/VzqOIuAbvW
— HT Lucknow (@htlucknow) July 30, 2023
రికార్డు చేయడంతో..
ఈ మాత్రానికే వారు రెచ్చిపోయి అతడిని చావచితక కొట్టారు. సమీపంలోని ఓ వ్యక్తి ఈ ఉదంతాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ గా మారింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. నిందితులను రాజేంద్ర మణి, అభిషేక్ సింగ్ గా గుర్తించారు. వారిని విధుల నుంచి తొలగించినట్టు జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు.