AP Shocker: ఒంటిమిట్ట రాములోరి గుడిలో యువకుడి దారుణం.. స్నానం చేస్తున్న మహిళా భక్తుల న్యూడ్ వీడియోల రికార్డింగ్.. బాత్రూం వెంటిలేటర్ నుంచి సెల్ ఫోన్ లో రికార్డింగ్.. కేకలు వేయడంతో పరార్
ఏపీలో దారుణం జరిగింది. వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అక్కడి తాత్కాలిక బాత్రూంలలో స్నానం చేస్తున్న మహిళలను వెంటిలేటర్ నుంచి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు.
Vontimitta, Aug 4: ఏపీలో (AP) దారుణం జరిగింది. వైయస్ఆర్ జిల్లా (YSR District) ఒంటిమిట్ట ఆలయంలో (Vontimitta Temple) ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అక్కడి తాత్కాలిక బాత్రూంలలో (Bathroom) స్నానం (Bath) చేస్తున్న మహిళలను వెంటిలేటర్ నుంచి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఇది గమనించిన మహిళలు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలించినా ఉపయోగం లేకపోయింది. సీసీకెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుడి ఆచూకీ కనుగొనడం కష్టంగా మారినట్టు తెలుస్తున్నది.
ఇలా జరిగింది..
గురువారం రాములవారి దర్శనం కోసం రెండు కుటుంబాలు ఆలయానికి వచ్చాయి. ఉదయం 6.30కి ఇద్దరు మహిళలు అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాత్రూంలలో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు బాత్రూం వెంటిలేటర్ నుంచి వారిని చిత్రీకరించడం ప్రారంభించాడు. మహిళలు ఇది గమనించి కేకలు వేయడంతో అతడు పరారయ్యాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
(The above story first appeared on LatestLY on Aug 04, 2023 08:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

