Credits: Twitter

Newdelhi, Aug 4: మెక్సికోలో (Mexico) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. 40 మంది ప్రయాణికులతో టియువానా వైపు వెళుతున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి లోయలో (Fell into Valley) పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 18 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో ఆరుగురు భారతీయులు (Indians) కూడా ఉన్నారు. నాయారిట్ రాష్ట్రంలో బర్రాంకా బ్లాంకా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదానికి అసలైన కారణమేంటో తెలియాల్సి ఉంది.

Telangana Crop Loan: తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభం, నేడు రూ.41 వేల లోపు రైతు రుణాలు మాఫీ, తొలిరోజు 44,870 మంది రైతుల‌కు ల‌బ్ధి

Telangana Assembly Session 2023: మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బీఏసీ మీటింగ్‌లో నిర్ణయం, తొలి రోజు మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

50 మీటర్ల లోతున్న లోయలో..

ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు, అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు 50 మీటర్ల లోతున్న లోయలో పడిపోవడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని అత్యవసర సిబ్బంది పేర్కొన్నారు.

అసెంబ్లీలో ఈటలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మంత్రి కేటీఆర్