CM Jagan Visakha Tour Schedule: సీఎం జగన్‌ విశాఖలో పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇదే, నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు

విశాఖపట్నంలో రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు.

CM Jagan Visakha Tour Schedule: సీఎం జగన్‌ విశాఖలో పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇదే, నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు
CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నంలో రేపు(మంగళవారం)  పర్యటించనున్నారు. నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు.

జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేయనున్న సీఎం.. అనంతరం సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకోనున్నారు. ఎలిమెంట్‌ ఫార్మా ఇంక్యుబేషన్‌ సెంటర్, బయో మానిటరింగ్‌ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం ప్రారంభించనున్నారు.అనంతరం అక్కడి నుంచి బయలుదేరి బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌కు రానున్నారు. అక్కడ ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్ధులతో సీఎం ఇంటరాక్ట్‌ కానున్నారు.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అర్బన్‌ ప్రాంతాల్లో కూడా డిజిటల్‌ లైబ్రరీలను తీసుకురావాలన్నారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖ పర్యటన సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు

చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న సీఎం.. లబ్ధిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలి. ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం

‘‘స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం అన్నది చాలా కీలకం. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎస్‌ జవహర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

(The above story first appeared on LatestLY on Jul 31, 2023 05:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).