AP Coronavirus: ఏపీలో 24 గంటల్లో 40 మంది మృత్యువాత, రాష్ట్ర వ్యాప్తంగా 38,044కి చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 19,393 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్
ఏపీలో గత కొన్నిరోజులుగా మరణాల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో ఈ ప్రమాదకర వైరస్ (AP Coronavirus) బారినపడి 40 మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు.
Amaravati, July 16: ఏపీలో గత కొన్నిరోజులుగా మరణాల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో ఈ ప్రమాదకర వైరస్ (AP Coronavirus) బారినపడి 40 మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. కరోనాని జయించిన 103 ఏళ్ల బామ్మ, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 కోవిడ్-19 కేసులు, 9,70,169కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్యల 492కి (AP Coronavirus Deaths) పెరిగింది.తాజాగా, 2,593 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 590, తూర్పు గోదావరి జిల్లాలో 500 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 38,044కి (AP Coronavirus Cases) చేరింది. 943 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 18,159 మంది చికిత్స పొందుతున్నారు. 19, 393 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 12,40,267 శాంపిల్స్‌ను పరీక్షించామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 15,285 మంది ఆస్పత్రుల్లో, 2,874 మంది కోవిడ్ కేర్ సెంటర్స్‌లో వెరసి మొత్తం 18,159 మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 590 కేసులు, తూర్పు గోదావరిలో 500 కేసులు, చిత్తూరు జిల్లాలో 205 కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలో కరోనా ఉధృతి తగ్గిందని అందరూ భావించారు కానీ ఒక్కసారిగా 590 కేసులు నమోదవ్వడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కరోనా నేపథ్యంలో శ్రీవారి ఆలయం దర్శనాలు ప్రారంభించిన తర్వాత 140 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ తిరుమలలో టీటీడీ అధికారులతో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కరోనా పరిస్థితులతో పాటు పలు విషయాలపై చర్చించారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. పోలీసులు, అర్చకులు, పోటు కార్మికులకు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ వచ్చిందన్నారు. 70 మంది ఉద్యోగులు ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారని ఆయన తెలిపారు. శ్రీవారి ఆలయంలో దర్శనాలు కన్నా పూజా కైంకర్యాలు నిర్వహించడానికే ప్రాధ్యనత కాబట్టి అర్చకులతో చర్చించామన్నారు.
(The above story first appeared on LatestLY on Jul 16, 2020 04:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

