One Rupee Biryani: ప్రకాశం జిల్లాలో రూపాయికే బిర్యానీ ఆఫర్.. ఇక ఏమవుతుంది?? అదే జరిగింది.. దాంతో రెస్టారెంట్ నిర్వాహకులు ఏం చేశారంటే??
రూపాయికే దమ్ బిర్యానీ అంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు కూడా అదే చేశారు. కట్ చేస్తే, తోపులాటలు, ట్రాఫిక్ జామ్. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరిగిందీ ఘటన.
Markapuram, April 7: రూపాయికే దమ్ బిర్యానీ అంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు కూడా అదే చేశారు. కట్ చేస్తే, తోపులాటలు, ట్రాఫిక్ జామ్. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరిగిందీ ఘటన. పట్టణంలో నిన్న ఓ రెస్టారెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. పాత రూపాయి నోటుకు దమ్ బిర్యానీ అంటూ ప్రచారం చేసింది. అంతే.. బిర్యానీ ప్రియులు ఆగమేఘాల మీద రెస్టారెంట్ ముందు వాలిపోయారు. పిల్లల నుంచి పెద్దల వరకు బిర్యానీ కోసం పోటీలు పడ్డారు. దీంతో తోపులాట జరిగింది.
మార్కాపురం-కంభం రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. జనం తాకిడికి తట్టుకోలేకపోయిన రెస్టారెంట్ యాజమాన్యం మధ్యాహ్నం వరకు బిర్యానీ పంపిణీ చేసి ఆ తర్వాత నిలిపివేసింది. .
(The above story first appeared on LatestLY on Apr 07, 2023 09:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

